Weak Heart Symptoms: మీ గుండె బలంగా లేదని చెప్పే సంకేతాలు ఇవే..!
Weak Heart Symptoms: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండెనని అందరికీ తెలుసు. అలాంటి గుండె బలహీనంగా ఉండటం ఎంత ప్రమాదకరమో తెలుసా..?

గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆగకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత సమస్యల వల్ల మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూనే ఉంది. 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు వారు కూడా గుండె జబ్బులతో చనిపోతున్నారు.
గుండెపోటు (Heart attack) లేదా గుండె వైఫల్యం (Heart failure)కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఈ సమస్యలన్నింటికీ కారణం మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలితో పాటుగా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర కావచ్చు. ఆహారం, చెడు అలవాట్ల వల్ల మీ గుండె బలహీనంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మీ గుండె బలహీనంగా (Weak Heart) ఉన్నప్పుడు.. మీ శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. వీటిని విస్మరించకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభంలో.. గుండెలో బలహీనత ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిరంతరం వికారం (Nausea)సమస్యతో బాధపడుతాడు. దీనితో పాటు ఛాతీలో నిరంతరం మండుతున్న అనుభూతి ఉంటుంది. మీకు చాలా రోజులుగా ఈ సమస్యలు ఉంటే దానిని విస్మరించకండి.
అధిక రక్తపోటు (High blood pressure): గుండె బలహీనత కారణంగా మీ రక్తపోటు కూడా అనియంత్రితంగా మారుతుంది. ఒకవేళ మీ గుండె బలహీనంగా ఉన్నట్లైతే.. మీకు అధిక రక్తపోటు సమస్య కూడా ఉండొచ్చు. అధిక రక్తపోటు సమస్య కారణంగా గుండెపోటు వంటి సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ రక్తపోటును చెక్ చేస్తూనే ఉండాలి.
breathing problem
శ్వాస ఆడకపోవడం: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాసకు సంబంధించిన సమస్యలు గుండె బలహీనతకు సంకేతం. గుండె బలహీనంగా ఉంటే మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
నిరంతర జలుబు, చలి: జలుబు, చలి సమస్యలు నిరంతరం కలగడం కూడా గుండె జబ్బులకు సంకేతం. ఈ సమస్యను మరింత నిర్లక్ష్యం చేస్తే మీ గుండె మరింత ప్రమాదంలో పడుతుంది.