ఉప్పు నీటిలో పాదాలను ఉంచితే ఏమౌతుంది..?
నీటిలో పాదాలు ఉంచడం వల్ల ఒత్తిడి తొలగిపోయి.. మంచి నిద్ర లభిస్తుందట. బాడీకి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది.
మనకు ఏవైనా గొంతు సమస్యలు ఉంటే.. ఉప్పు నీటితో పుక్కిలిస్తూ ఉంటాం. డాక్టర్లు కూడా అదే చెబుతూ ఉంటారు. అలా ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల.. గొంతు సంబంధిత సమస్యలు , దగ్గు లాంటివి తగ్గుతాయి. అయితే… అదే ఉప్పు నీటిలో మనం పాదాలను ఉంచితే ఏమౌతుందో తెలుసా? దీని వల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దాం…
అది కూడా నార్మల్ వాటర్ లో కాదు.. గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేయాలి. దాదాపు 15 నిమిషాల పాటు ప్రతిరోజూ ఈ ఉప్పు నీటిలో ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఉప్పులోని మెగ్నీషియం సల్ఫేట్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి కూడా మనకు మేలు చేస్తాయి.
రాత్రి పడుకునే ముందు ఇలా గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి.. ఆ నీటిలో 15 నిమిషాల పాటు ఉంచి.. ఆ తర్వాత పడుకుంటే ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. రోజంతా చేసిన పని, ఒత్తిడి కారణంగా రాత్రిపూట మనం కోరుకున్నట్లు నిద్రపట్టదు. నిద్రలేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అదే.. ఇలా నీటిలో పాదాలు ఉంచడం వల్ల ఒత్తిడి తొలగిపోయి.. మంచి నిద్ర లభిస్తుందట. బాడీకి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది.
కడుపుతో ఉన్న మహిళలకు కూడా ఈ ఉప్పు నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. గర్భిణీ స్త్రీలకు నెలలు నిండే సమయంలో కాళ్లు బాగా నీరు పట్టేస్తాయి. పాదాలకు నొప్పి చేసి ఇబ్బందిపడుతూ ఉంటాయి. దీని వల్ల మంచిగా నిద్ర కూడా పట్టదు. అలాంటివాళ్లు.. ఇలా చేయడం వల్ల.. కేవలం 15 నిమిషాల సమయం కేటాయించి.. ఉప్పు నీటిలో పాదాలు ఉంచడం వల్ల…. వారికి ఆ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గోరువెచ్చని ఉప్పు నీటిలో పాదాలను ఉంచడం వల్ల.. రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. దీని వల్ల.. పాదాలు మంచిగా బలంగా మారతాయి.
మనలో చాలా మంది రోజులో చాలా సేపు బయట ఉంటారు. చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. షూస్ వేసుకుంటారు. వాటి కారణంగా పాదాల్లో బ్యాక్టీరియా చేరుతుంది. ఇవి పాదాలను నాశనం చేస్తాయి. అదే ఈ ఉప్పు నీటిలో పాదాలను ఉంచడం వల్ల బ్యాక్టీరియా నాశనం అవుతుంది. పాదాలు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అంతేకాదు.. కాళ్ల మజిల్స్ కూడా బలంగా మారతాయి. శరీరానికి మంచి రిలాక్సేషన్ కూడా లభిస్తుంది. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా.. పాదాల నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గిపోతుంది.