HealthTips: చిరుధాన్యాలని చిన్న చూపు చూడకండి.. వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు?
HealthTips: చిరుధాన్యాలని చాలావరకు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారని ఒక చిన్న చూపు చూస్తారు ఆరోగ్యవంతులు కానీ అది నిజం కాదని చెప్తున్నారు నిపుణులు అదేంటో చూద్దాం.

చిరుధాన్యాలనే తృణధాన్యాలని, మిల్లెట్స్ అని కూడా అంటాము.ఇవి గడ్డి జాతికి చెందిన పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం పండిస్తారు.ఈ మిల్లెట్స్ తినటం వల్ల ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూద్దాం. సాధారణంగా చిరుధాన్యాలని అనారోగ్య సమస్యలలో ఉండే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అని అపోహ ఉంది.
కానీ అది అపోహ మాత్రమే వాటి ఉపయోగాలు తెలుసుకుంటే మీరే షాక్ అవుతారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ మిల్లెట్స్ ని తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు అనారోగ్యాన్ని దరిచేరకుండా చూసుకోవచ్చు. ఈ మిల్లెట్స్ లో జొన్నలు, రాగులు, సజ్జలు, వరిగెలు, సాములు, ఇంకా చాలానే ఉన్నాయి.
వీటిలో ప్రోటీన్లు పీచు పదార్థం ఇనుము పిండి పదార్థం అధికంగా ఉంటుంది. పైగా ఇవి షుగర్ పేషంట్లకి ఒక బలం.లాంటిది చిరుధాన్యాలతో చేసిన పదార్థాలని నములుతూ తినటానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకే తీసుకునే ఆహార పరిణామం సైతం తగ్గుతుంది తద్వారా ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి తొందరగా ఆకలి వేయదు. దీనివలన రక్తంలో కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.
millets for weight loss
అలాగే సిరి ధాన్యాలు శరీరంలోని ఆమ్లస్థాయిలు తగ్గటానికి ఉపయోగపడతాయి. వీటిలో కాల్షియం జనుము లభించడంతోపాటు మలబద్ధకం కూడా దూరం అవుతుంది. అధిక బరువు డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా సజ్జలని తీసుకోవడం వల్ల ఆ సమస్యని కొంతవరకు దూరం చేయవచ్చు.
అలాగే మలబద్ధకం ఉన్నవారు ఊదలు తీసుకోవాలి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు జొన్నలు తీసుకోవాలి. మైగ్రేన్ సమస్య ఉన్నవారు సామలను వండుకోవటానికి తినాలి ఇవి ఎముకలని నరాలనే దృఢంగా మారుస్తాయి.
అలాగే బాలింతలలో ఎక్కువగా పాలు కూడా తయారవుతాయి. అలాగే కిడ్నీలో స్టోన్లు ఉన్నవారు ఉలవలను తినాలి అధిక బరువుతో బాధపడేవారు కొర్రలను వండుకొని తినాలి దీనివల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. కాబట్టి చిరుధాన్యాలని చిన్నచూపు చూడటం మానేసి ఇప్పటినుంచే తినడం ప్రారంభించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.