ముద్దులు ఎన్ని రకాలో.. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా?
పెదాలపై చిరునవ్వుతో తప్ప ముద్దులోని మాధుర్యాన్ని మాటల్లో చెప్పలేం. అందుకే ప్రేమలో ఉన్న ప్రతి జంటా వీలున్నప్పుడల్లా ముద్దుల్లో మునిగిపతుంటారు. అందులోనూ ఈ రోజు కిస్ డే. ఇంకేముంది నచ్చిన చెలి అందమైన పెదాలతో లిప్ కిస్ పక్కాగా తీసుకుంటారు. మీకు తెలుసా ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిని కూడా పెట్టొచ్చు.

ముద్దు నాలుగు పెదాల కలయికే కాదు.. మనసులోని భావాలను చెప్పే మధురమైన అనుభూతి కూడా. ముద్దు కొద్దిసేపటి వరకే పెట్టుకున్నా.. ఇది ఆ జన్మకు సరిపోయే భావాలను చెబుతుంది. పెదాల స్పర్శ మీ భాగస్వామి ప్రేమను, ఆప్యాయను మీకు తెలియజేస్తుంది. స్వచ్ఛమైన ప్రేమకు మాటలు అవసరం లేదు. అందుకే మాటలు కరువైనప్పుడు ఇలా ముద్దు రూపంలో చెప్పేస్తుంటారు చాలా మంది. ముద్దును అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదండీ. ఎందుకంటే ఇదే మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్తుంది. అలా చాలా మంది లిప్ కిస్ ను ఎప్పుడూ పెడుతుంటారు. కానీ ముద్దును ఎన్నో రకాలుగా పెట్టొచ్చు. అవును ఫ్రెంచ్ కిస్, అమెరికన్ కిస్ అంటూ ఎన్నో రకాల ముద్దులున్నాయి. వాటిని కూడా ట్రై చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ఫ్రెంచ్ కిస్
ముద్దు మానసిక స్థితిని మారుస్తుంది. ఒత్తిడినంతా చిటికెలో పోగొడుతుంది. ఫ్రెంచ్ కిస్ ను చాలా మంది ఇష్టపడతారు. ఇది ప్రేమను పంచడమే కాదు.. మిమ్మల్ని సెక్స్ వరకు కూడా తీసుకెళుతుంది. పెదాలు, నాలుకతో ఈ ముద్దును ఆస్వాదిస్తారు.
Image: Getty Images
సింగిల్ లిప్ కిస్
సింగిల్ లిప్ కిస్ రొమాంటిక్ గా ఉంటుంది. మీ భాగస్వామికి ఐలవ్ యూ చెప్పడానికి ఉత్తమ మార్గం ఈ సింగిల్ లిప్ కిస్. దీనిలో మీ భాగస్వామికి దగ్గరగా వంగి ఒక పెదవును మాత్రమే కిస్ చేయాలి. ఈ ఘాటైన్ లిప్ కిస్ సెక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
Image: Getty Images
అమెరికన్ కిస్
ఫ్రెంచ్ ముద్దు మాదిరిగానే.. ఇది కూడా ఉంటుంది. కానీ దీనిలో నాలుకను ఉపయోగించకూడదు. దీనిలో మీ భాగస్వామి నడుమును దగ్గరగా పట్టుకోండి. వారి శరీరాన్ని మీ శరీరానికి దగ్గరగా ఉండేట్టు చూసుకోండి. ఆ తర్వాత వారిని గట్టిగా ముద్దుపెట్టుకోవాలి. అంతే.. ఇది ఇరువురికి రొమాంటిక్ ఫీలింగ్ ను కలిగిస్తుంది.
ఐస్ కిస్
ఐస్ కిస్ గురించి విన్నవాళ్లు చాలా తక్కువే ఉంటారు. డిఫరెంట్ కిస్ ను ట్రై చేయాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.. దీనిలో మీ ఇద్దరి పెదాల మధ్యన ఐస్ క్యూబ్స్ ను పెట్టుకోండి. ఈ ఐస్ క్యూబ్స్ కరిగే వరకు ముద్దులో మునిగిపోండి. ఇది మీకు మంచి థ్రిల్లిగ్ ను ఇస్తుంది.
నిబ్బుల్ కిస్
కిస్ తో మీ భాగస్వామిని రొమాంటిక్ గా మార్చాలనుకుంటున్నారా? అయితే ఈ నిబ్బుల్ కిస్ ను ట్రై చేయండి. నిజానికి ముద్దులు చాలా క్యూట్ గా, సెన్సిటీవ్ గా ఉంటాయి. ఇక ఈ నిబ్బుల్ కిస్ లో మీ భాగస్వామి కింది పెదవిని మీ మునిపంటితో పట్టుకుని సున్నితంగా కొరకండి. అలా అని మరీ గట్టిగా కొరకకూడదు. ఈ కిస్ మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
బటర్ ఫ్లై కిస్
దీనికి మీరు చేయాల్సిందల్లా.. మీ భాగస్వామికి దగ్గరగా కూర్చోండి. మీ కను రెప్పలు మీ భాగస్వామి కనురెప్పలను తాకేలా చూడండి. అలాగే మీరు ముద్దుపెట్టేటప్పుడు సీతాకోకచిలుక రెక్కల లాగే మీ కనురెప్పలను జోడించండి. ఇది మిమ్మల్ని సిగ్గులో మునిగేలా చేస్తుంది.