MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • నూనెలు, షాంపూలను మార్చడం కాదు.. వీటిని వాడండి జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది

నూనెలు, షాంపూలను మార్చడం కాదు.. వీటిని వాడండి జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది

నూనెలు, షాంపూలను మార్చినంత మాత్రాన జుట్టు ఊడిపోవడం ఆగదు. ఎందుకంటే జుట్టుకు లోపలి నుంచి పోషణ ఉంటేనే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. ఇందుకోసం పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి.  

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 25 2022, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి ముందుగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా.. షాంపూను మార్చాలి. నూనెను మార్చాలి. వీటివల్లే జుట్టు ఊడిపోతుంది. సో వీటిని మార్చేస్తే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుందని భావిస్తారు. నిజానికి జుట్టు ఊడిపోవడానికి వీటిని మార్చడానికి సంబంధమే లేదు. కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూ వల్ల ఒక్కో సారి జుట్టు ఊడిపోయినా.. మరీ దారుణంగా జుట్టు ఊడిపోవడానికి షాంపూలు, నూనెలు కారణం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే జుట్టుకు సరైన పోషణ అందకపోతేనే ఊడిపోతుంది. అందుకే జుట్టుకు పోషణను అందించే ఆహారాలనే తినాలి. అప్పుడే జుట్టు ఊడటం ఆగి బలంగా పెరగడం మొదలవుతుంది. 

26

కొన్ని రకాల పండ్లు, కూరగాయలతో చేసిన హెయిర్ మాస్క్ లు కూడా జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. అంతేకాదు జుట్టును ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. ఇందుకోసం ఉసిరి, అరటిపండ్లు, కరివేపాకు, బచ్చలి కూర వంటివి ఉపయోగపడాయి. హెయిర్ ఫాల్ ను ఆపే హెయిర్ మాస్క్ ల గురించి తెలుసుకుందాం పదండి. 

36

బచ్చలికూర

బచ్చలికూరతో తయారుచేసిన హెయిర్ మాస్క్ జుట్టు సంరక్షణకు ఉపయోగించడం మంచిది. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి లు మాడులో నూనె ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తాయి. అలాగే జుట్టును మాయిశ్చరైజ్ కూడా చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతుంది. దీంతో జుట్టు ఫాస్ట్ గా పెరగడం మొదలవుతుంది.  ఈ బచ్చలికూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ ఫాల్ ను ఆపుతాయి.  ఇందుకోసం ఒక కప్పు బచ్చలికూర ఆకులు, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను తీసుకుని హెయిర్ మాస్క్ ను తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల  నుంచి గంట వరకు ఆరబెట్టి మైల్డ్ షాంపూతో కడిగేయండి. వారానికి ఒక సారి ఈ మాస్క్ ను వేసుకుంటే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. 

46
banana

banana

అరటిపండ్లు

అరటిపండు మన శరీరానికే కాదు జట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ల పుష్కలంగా ఉంటాయి. ఈ అరటి హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్ ను తగ్గించడమే కాదు చుండ్రును కూడా పోగొడుతుంది. దీనికోసం ముందుగా అరటిపండును గుజ్జులా చేసి అందులో కప్పు పెరుగును మిక్స్ చేయండి. ఆ తర్వాత దీనిలో టీస్పూన్ కలబంద జెల్, రెండు విటమిన్ ఇ మాత్రలు కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు మొత్తానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో జుట్టుకు శుభ్రం చేసుకోండి. 

56

ఉసిరి

ఉసిరిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అలాగే చర్మాన్ని కూడా రక్షించడానికి సహాయపడతాయి. ఉసిరి చుండ్రును వదిలించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు ఉసిరికాయలను తీసుకుని గ్రైండ్ చేయండి. దీనికి కొద్దిగా పెరుగును కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టంతా అప్లై చేయండి. అరగంట తర్వాత జుట్టును నీట్ గా కడగండి. ఈ హెయిర్ మాస్క్ చుండ్రును పోగొట్టి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. 

66

నిమ్మరసం

నిమ్మరసం కూడా జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో  పుష్కలంగా ఉండే విటమిన్ సి జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం నిమ్మరసం నీటితో తలస్నానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Grey Hair: అప్పుడే తెల్ల జుట్టు వచ్చేసిందా? ఇవి రాస్తే మళ్లీ నల్లగా మారతాయి..!
Recommended image2
చలికాలంలో నువ్వులు తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image3
పెళ్లై పిల్ల‌లున్న వారు ల‌వ‌ర్‌తో క‌లిసి భ‌ర్త‌ల‌ను ఎందుకు చంపేస్తున్నారు.? సైకాల‌జీ ఏం చెబుతోందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved