Baldness: చిన్న వయసులోనే బట్టతల వచ్చేసిందా? ఈ నూనెలను వాడండి.. జుట్టు ఊడటం ఆగిపోతుంది..
Hair Care Tips: జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అయినా జుట్టు ఊడిపోతూనే ఉంటుంది. అయితే జుట్టుకు నేచురల్ ఆయిల్స్ ను పెడితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

ఒకప్పుడు బట్టతలలు కేవలం ముసలివాళ్లకు మాత్రమే ఉండేవి. వీళ్ల వయసు మీద పడుతుంది.. అని బట్టతలలను చూసే చెప్పేటోళ్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇలా లేదు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 25 నుంచి 35 ఏండ్ల యువకులకు కూడా బట్టతల వస్తుంది. ఇక బట్టతల వస్తే పెండ్లి ఎవరు చూసుకుంటారన్న భయాలు కూడా పెరిగిపోతున్నాయి. బట్టతలల కారణంగా పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్న వార్తలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి.
నిజానికి బట్టతల వివిధ కారణాల వల్ల వస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి, కొన్ని రకాల మందు బిల్లలు, జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు ఊడిపోతుంది. బట్టతల వస్తుంది. ముఖ్యంగా జుట్టుకు సరైన పోషకాలు అందకపోతే కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది. అయితే కొన్ని రకాల నూనెలను జుట్టుకు అప్లై చేయడం వల్ల వెంట్రుకలు రాలడం ఆగుతుంది. ఆ నూనెలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం నూనె (Almond oil)
బాదం నూనె ముఖ్య సౌందర్యానికే కాదు.. హెయిర్ ఫాల్ సమస్యను కూడా పోగొడుతుంది. దీనిలో ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ ఇ దుమ్ము, దూళీ చెడు ప్రభావాల నుంచి జుట్టును రక్షిస్తుంది. బాదం నూనెను రెగ్యులర్ గా జుట్టుకు పెట్టుకుంటే జుట్టు రాలిపోయే ఛాన్స్ యే ఉండదు. అంతేకాదు జుట్టు కూడా షైనీగా, నల్లగా.. పొడుగ్గా పెరుగుతుంది.
coconut oil
కొబ్బరి నూనె (coconut oil)
కొబ్బరి నూనె కూడా స్కిన్ కు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం ఉండే జిడ్డంతా తొలగిపోయి నీట్ గా మారుతుంది. అంతేకాదు ఈ కొబ్బరి నూనెను జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. వెంట్రుకలు పగిలిపోయే అకాశమే ఉండదు. హెడ్ బాత్ చేసే గంట ముందు కొబ్బరి నూనెతో జుట్టుకు మర్దన చేస్తే జుట్టు ఊడిపోయే ప్రమాదమే ఉండదు.
ఆలివ్ నూనె (Olive oil)
ఆలివ్ ఆయిల్ అన్ని రకాల నూనెల్లో ది బెస్ట్ వంటనూనెగా పేరుపొందింది. దీన్ని వంటల్లో ఉపయోగించడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుందన్న సంగతి మీకు తెలుసా..?
అవును జుట్టుకు ఆలివ్ ఆయిల్ ను రాయడం వల్ల తలలో దురద, మాడు ఇన్ఫెక్షన్స్, అలెర్జీ సమస్యలు మటుమాయం అవుతాయి. అందుకే జుట్టు రాలే సమస్య ఉన్న వారు ఆలివ్ ఆయిల్ ను వాడితే చక్కటి ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయ రసంతో కొబ్బరి నూనె
ఉల్లి లేని కూరలను.. ఉప్పు లేని పప్పు చారుతో పోల్చుతారు కొంతమంది. అవును మరి ఈ రోజుల్లో ఉల్లిలేని కూరలు వెతికినా దొరకవు. ఎందుకంటే ఉల్లిపాయ వంటను రుచిగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఉల్లి జుట్టుకు కూడా సహాయపడుతుందని చాలా తక్కువ మందికే తెలుసు.. ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది.
ఉల్లిని మెత్తగా గ్రైండ్ చేసి.. దాన్నుంచి రసాన్ని తీసి.. ఒకగిన్నెలో నిల్వ చేసి కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఈ నూనెను గోరువెచ్చగా వేడి చేసుకోవచ్చు. ఈ నూనె బట్టతల సమస్యలను రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది.