జుట్టుకు షాంపూ పెట్టేముందు ఈ పనులు చేస్తున్నారా? లేదా? లేదంటే జుట్టు ఊడిపోతుంది
జుట్టు విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే చుండ్రు, హెయిర్ ఫాల్, వెంట్రుకలు తెగిపోవడం వంటి ఎన్నో జుట్టు సమస్యలు వస్తాయి.
అందమైన, ఒత్తైన, నల్లని జుట్టు ప్రతి ఒక్కరికీ ఇష్టమే. దీని కోసం ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయితే మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల వెంట్రుకలు రెండుగా చీలుతాయి. అలాతే విపరీతంగా రాలిపోతుంది. అందుకే జుట్టుకు షాంపూ పెట్టడానికి ముందు తర్వాత కొన్ని పనులను చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Hair wash
దువ్వడం
జుట్టుకు షాంపూను పెట్టడానికి ముందే మీ జుట్టును ఖచ్చితంగా దువ్వాలి. చిక్కులు లేకుండా దువ్విన తర్వాతే తలస్నానం చేయాలని . షాంపూను పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు తెగిపోయే అవకాశం తగ్గుతుంది.
నూనె పెట్టడం
తలస్నానం చేయడానికి ముందు జుట్టుకు నూనెను పెట్టడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు నూనెను జుట్టంతా పెట్టండి. ఇది మీ జుట్టును మృదువుగా, షైనీగా చేస్తుంది. ఇందుకోసం కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించండి.
hair care
సరైన షాంపూ
జుట్టుకు షాంపూను పెట్టడం ఎంత ముఖ్యమో.. సరైన షాపూను సెలక్ట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. మీ జుట్టు రకాన్ని బట్టి షాంపూను పెట్టాలి. మీ షాంపూలో సల్ఫేట్, పారాబెన్ లో ఉండకూడదు.
సరైన పరిమాణంలో ఉపయోగించడం
అయితే చాలా మంది జుట్టుకు షాంపూను మరీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఇది జుట్టు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మీ జుట్టును దెబ్బతీస్తుంది. అలాగే మీరు షాంపూను ఉపయోగించినప్పుడల్లా జుట్టు నిండా పెట్టాలి.
కండీషనర్
జుట్టుకు షాంపూను పెట్టిన తర్వాత ఖచ్చితంగా కండీషనర్ ను వాడాలి. అయితే కండిషనర్ ను జుట్టుకు మాత్రమే అప్లై చేయాలి. నెత్తికి మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే ఇది జుట్టు జిడ్డుగా మారుస్తుంది. ఈ కండీషనర్ ను దువ్వెన సహాయంతో కూడా అప్లై చేయొచ్చు.
చల్లటి నీరు
జుట్టును ఎప్పుడూ కూడా చల్లని నీటితోనే వాష్ చేయాలి. వేడి నీటిని అసలే ఉపయోగించకూడదు. ఎందుకంటే వేడి నీటితో జుట్టు వాష్ చేయడం వల్ల జుట్టు పొడిబారుతుంది. నెత్తిమీదున్న సహజ నూనెలు పోతాయి. వెంట్రుకలు రాలే అవకాశం కూడా ఉంది. అందుకే మీ జుట్టుకు చల్లని నీటిని మాత్రమే ఉపయోగించండి. చలికాలంలో గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి.