guru purnima 2022: గురు పూర్ణిమ రోజు ఇలా పూజ చేస్తే.. గురుదోషం తొలగిపోతుంది..
guru purnima 2022: ప్రతి ఏడాది ఆషాడ మాసంలో శుక్ల పక్షంలో గురు పూర్ణిమ వస్తుంది. ఈ గురు పూర్ణిమ రోజున గురువును పూజిస్తే జీవితంలో మంచి విషయాలను అందుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

guru purnima 2022
నేడు గురు పూర్ణిమ. ప్రతి ఏడాది గురుపూర్ణిమ ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. గురు పూర్ణిమను జరుపుకోవడం వెనుక గొప్ప చరిత్ర ఉంది. పురణాల ప్రకారం.. గురుపూర్ణిమ అనేది మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి జన్మదినం. ఈ ఆయన పుట్టిన రోజునే మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే వేదవ్యాసుడు మనుషులందరికీ జ్ణానాన్ని అందించి గురువుగా గొప్ప పేరు పొందారు.
ఈ గొప్ప రోజున వేదవ్యాసుడుని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు గురు పూజ చేయడం వల్ల గురు స్థానం బలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కెరీర్ లో పరంగా ముందుకు వెళ్లాలంటే ఈ రోజు ఎలా పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం..
గురు పూర్ణిమ రోజున విష్ణుదేవుడిని పూజించండి. ముఖ్యంగా మీ చేతనైన సాయం పేదలకు చేయండి. వస్త్రాలను, మిఠాయిలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయంటున్నారు జ్యోతిష్యులు. వీటి వల్ల గురు దోషం పోతుందట. అలాగే అదృష్టం ఎప్పుడూ మీతోనే ఉంటుందట.
గురు పూర్ణిమ నాడు శెనగ పప్పును పేదలకు దానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బులకు ఏ లోటుండదు.
ఈ రోజున గురు యంత్రాన్ని స్థాపించడం వల్ల పెళ్లికి ఎలాంటి ఆటంకాలు కలగవు. ఏవైనా సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి.
గురు పూర్ణిమ రోజున గోమాతను పూజిస్తే.. చదువులో రాణిస్తారని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు. అన్నింట్లో విజయం మీ సొంతమవుతుంది. ఈ రోజు భగవద్గీతను చదివితే కెరీర్ పరంగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఈ రోజున గురువులను మనస్ఫూర్తిగా పూజించి వారి ఆశీర్వాదం తీసుకుంటే మీకన్నీ శుభాలే కలుగుతాయి. సకల కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Guru Purnima Wish card
ఈ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దాన ధర్మాలు చేయడం వంటి కార్యాక్రమాల ద్వారా గురువు అనుగ్రహం పొందుతారు.