Gastric Problem: కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
Gastric Problem: అతి నిద్ర, నిద్రలేమి సమస్య, శారీరక శ్రమ లేకపోవడం, ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోవడం, చెడు ఆహారపు అలవాట్లు, మారిన మన జీవన శైలి కారణంగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుందని వైద్యులు తేల్చి చెబుతున్నారు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..

ప్రస్తుత కాలంలో గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారుతున్న మన జీవన శైలి అనే చెప్పుకోవచ్చు. అతి నిద్ర, నిద్రలేమి సమస్య, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం, శారీరక శ్రమ మొత్తమే లేకపోవడం, కొన్ని రకాల జబ్బులకు వాడే టాబ్లెట్స్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కడుపులో మంట, నొప్పి, కడుపు టైట్ గా మారడం, పొట్ట ఉబ్బరంగా అనిపించం, ఆయాసం, తేన్పులు రావడం, గుండె మంట వంటి సమస్యలు వస్తుంటారు. ఈ సమస్యల వల్ల సరిగ్గా నడవలేరు కూడా. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే.
ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట 40 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయాలి. శరీరానికి అవసరమయ్యే నీళ్లను తాగుతూ ఉండాలి.
ఈతకొట్టడం, తాడాట (Skipping) చేసినా గాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడగలుగుతారు. తిన్న ఒక అరగంట తర్వాత కాసేపు నడవాలి.
ముఖ్యంగా స్పైసీ ఫుడ్ అస్సలు తినకూడదు. గ్యాస్ట్రిక్ సమస్యను కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ అలవాటును మానుకోవడం ఉత్తమం. వేళా పాళా లేని తిండి అలవాట్లకు గుడ్ బాయ్ చెప్పాలి. ప్రతి రోజూ సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి.
గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కాస్త అల్లం ముక్కను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. వాటిని కొన్ని నీళ్లలో వేసి బాగా మరిగించి తాగితే చక్కకటి ఫలితం ఉంటుంది.
గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కాస్త అల్లం ముక్కను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. వాటిని కొన్ని నీళ్లలో వేసి బాగా మరిగించి తాగితే చక్కకటి ఫలితం ఉంటుంది.
కాస్త అల్లం ముక్కను తీసుకుని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి.. ఆ రసానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకున్నా గ్యాస్ ప్రాబ్లమ్ పోతుంది.
టీ స్పూన్ వామును తీసుకుని అందులో కాస్త ఉప్పును వేసి బాగా నలిపి దాన్ని తినాలి. ఆ తర్వాత నీళ్లు తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఒక గ్లాస్ నీళ్లను తీసుకుని అందులో నిమ్మరసం, తేనెను మిక్స్ చేసి అందులో కాస్త బేకింగ్ సోడాను వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ నీళ్లను తాగితే కడుపు ఉబ్బరం సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.