MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వేలిముద్రలు ఇలా ఉంటే తరచూ జాబ్స్‌ మారుతారు.. మీ ఫింగర్‌ ప్రింట్సే కేరక్టర్ ఏంటో చెప్పేస్తాయ్ తెలుసా?

వేలిముద్రలు ఇలా ఉంటే తరచూ జాబ్స్‌ మారుతారు.. మీ ఫింగర్‌ ప్రింట్సే కేరక్టర్ ఏంటో చెప్పేస్తాయ్ తెలుసా?

మీ వేలిముద్రలు వ్యక్తిత్వ లక్షణాలను ఎలా వెల్లడిస్తాయో తెలుసుకోండి. మూడు ప్రధాన వేలిముద్ర రకాలైన శంఖు ఆకారం (లూప్స్), వృత్తాకారం (వోర్ల్స్), వంపు గీతలు (కర్వ్స్) మీ స్వభావం, ప్రవర్తన గురించి ఏం చెబుతాయంటే...?

1 Min read
Author : Galam Venkata Rao
Published : Aug 01 2024, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వేలిముద్రలు మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావాన్ని తెలియజేయడంలో కీలకమైన భాగం. ప్రతి వ్యక్తి వేలిముద్రలు ప్రత్యేకమైనవి. వేలి ముద్రలను బట్టి వ్యక్తిత్వ లక్షణాలు మారుతుంటాయి. న్యూరోసైన్స్, జెనెటిక్స్, డెర్మటోగ్లిఫిక్స్, సైకాలజీ లాంటి విభాగాల్లోని పరిశోధనలు.. వేలిముద్రలు మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలవని తెలియజేశాయి.

25

వేలిముద్రలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. శంఖు ఆకారం (లూప్స్), వంపు గీతలు (కర్వ్స్), వృత్తాకారం (వోర్ల్స్). ప్రతి రకం ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది.

35

వృత్తాకారం (వోర్ల్స్):

వృత్తాకార వేలిముద్రలున్న వ్యక్తులు ఒంటరిగా ఉండటానికి మొగ్గు చూపుతారు. తమకు నచ్చినట్లు పనులు చేసుకుంటూ ముందుకు సాగుతారు. స్వార్థం, స్వతంత్ర భావాలు కలిగిన వీరు రిజర్వుడ్‌గా ఉండేందుకు ఇష్టపడతారు. వీరికి ఉన్న తెలివితేటలు, ప్రతిభ, సృజనాత్మకతతో పనుల్లో ముందుకు సాగుతూ విజయాన్ని సాధిస్తారు. చుట్టూ ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించడంలో వోర్ల్స్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ కలిగినవారు నేర్పరులు.

45
Confidence

Confidence

వంపు గీతలు (కర్వ్స్):

కర్వ్స్ ఆకారంతో వేలిముద్రలున్న వ్యక్తులు ధైర్యవంతులు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రతి పనిలోనూ ప్రాక్టికల్‌గా వ్యవహరిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరిని ఎవరూ ప్రభావితం చేయలేరు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వీరు అప్డేట్‌ అవుతూ ఉంటారు.

55

శంఖు ఆకారం (లూప్స్):

శంఖు ఆకారంతో వేలిముద్రలున్న వ్యక్తులు సాధారణంగా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. వారు పనులను కష్టపడుతూ ప్రారంభిస్తారు. కానీ ఎంత సాధించినా సంతృప్తి చెందలేరు. వీరికి ఎక్కువగా ఊహల్లో జీవనపు ఆనందం ఉంటుంది. అందువల్ల వారు తరచూ బోర్ ఫీల్ అవుతుంటారు. ఈ లక్షణాలు కలిగినవారు ఉద్యోగాలు తరచూ మారుతూ ఉంటారు. కానీ నిజాయితీతో, సానుభూతితో ఉండి స్నేహితులను సంపాదిస్తారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trendy Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో 30లోనూ 20లా కనిపిస్తారు!
Recommended image2
Rat Control Tips: ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేసే బెస్ట్ టిప్స్ ఇవిగో!
Recommended image3
Tulsi Plant: పీరియడ్ టైంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved