Angry: తరచుగా కోపం వస్తోందా? అయితే మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నటే..!
Angry: సాధారణంగా కోపం అందరికీ వస్తుంటుంది. కానీ కొంత మందికి మాత్రం సమయం సందర్భం అంటూ ఏదీ పట్టించుకోకుండా ఊరికూరికే కోపమైతుంటరు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.

Angry: సంతోషం, బాధ, ఆనందం, దు:ఖం ఇవన్నీ అందరికీ సర్వ సాధారణంగా కలుగుతూ ఉంటాయి. ఫీలింగ్స్ లేని మనుషులు ఉండరు కూడా. ఈ ఫీలింగ్స్ అన్నీ సమయం సందర్భాన్ని పట్టి వస్తూ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫీలిగ్స్ ఉండేవి కొంత సమయం మాత్రమే. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో అవసరం కూడా.
ఇకపోతే ప్రతి మనిషికీ కోపం వస్తూ పోతూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం కోపం 24 గంటలు ఆన్ లోనే ఉంటుంది. అయిన దానికి కాని దానికి కోప్పడుతూనే ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కసురుతుంటారు. గొడవ పడుతుంటారు. అరుస్తుంటారు. ఒక వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే.. దాని వెనక ఏదో బలమైన కారణం ఉందని గుర్తించాలి.
చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే వ్యక్తి శారీరక, మానసిక సమస్యల బారిన పడ్డాడని అర్థం చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం పదండి..
డిప్రెషన్: ప్రస్తుత కాలంలో డిప్రెషన్ బారిన పడే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ సమస్య బారిన పడటానికి ప్రధాన కారణం.. వారు తీవ్రమైన మానసిక వ్యధను అనుభవిస్తున్నారని అర్థం. ఈ సమస్య ఉన్న వ్యక్తులు వాళ్లకు తెలియకుండానే కోపమవుతుంటారు. అంతేకాదు వీరిలో రోజు రోజుకు నిరాశ పెరిగిపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ గా రెస్పాండ్ అవుతూ కోప్పడుతూ ఉంటారు.
మూర్ఛ: పలు అధ్యయనాల ప్రకారం.. మూర్ఛ వ్యాధిగ్రస్తులు కూడా ఎక్కువగా భావోద్వేగానికి లోనవుతూ ఉంటారట. తరచుగా కోప్పడటం, దూకుడుగా వ్యవహరించడం వంటివి భావాలు వీరిలో ఎక్కువగా కలుగుతాయట.
ఒసీడీ: ఓసీడీ కూడా ఒక రకమైన మానసిక సమస్యే అంటున్నారు నిపుణులు. వీరికి అతి పరిశుభ్రత, పనులు చెప్పిన సమయానికే జరగాలనుకునే మనస్థత్వం ఉంటుంది. ఒక వేళ అలా జరగకపోతే ఎక్కువగా కోపగించుకుంటూ ఉంటారు.
డ్రగ్స్, ఆల్కహాల్: డ్రగ్స్, ఆల్కహాల్ ఎక్కువగా తాగే అలవాటున్న వారికి కోపం తరచుగా వస్తూనే ఉంటుంది. మద్యానికి బానిసలుగా మారిన వారికి చిన్న చిన్న విషయాలకు కూడా కోపమొస్తుంటుంది. చెడు అలవాట్ల వల్ల ఏది మంచి ఏది చెడు అన్న ఆలోచనా శక్తిని కోల్పోతారు.
బైపోలార్ డిజార్డర్: వైద్యం అవసరమున్న మానసిక వ్యాధే బైపోలార్ డిజార్డర్. ఈ వ్యాధి బారిన పడిన వారు కూల్ గా కనిపించినా ఉన్నట్టుండి కోపం తెచ్చుకుంటారు.