ఇంట్లోకి ఈగలు రాకూడదంటే ఏం చేయాలి?
ఇంట్లోకి ఈగలు వస్తున్నాయా? కాలంతో సంబంధం లేకుండా ఇంట్లోకి దూరి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటితో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువే. మరి, ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈగల బాధ తగ్గించుకోండి
వేసవికాలం, చలికాలం అనే తేడా లేకుండా ఇంట్లోకి ఈగలు ప్రవేశించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వర్షాకాలంలో వీటి బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈగలు మనకు పెద్ద ప్రమాదకరం కాకపోయినా.. వాటి ద్వారా అంటు వ్యాధులు మాత్రం ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అవి ఆహారం మీద లేదా మన మీద తిరుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆహారం మీద వాలినప్పుడు.. ఆ భోజనం తినడం వల్ల మనకు విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోకి ఈగలు రాకుండా చూసుకోవాలి. మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు.. వెళ్లగొట్టినా ఈగలు వస్తూనే ఉంటాయి. మరి, వీటిని శాశ్వతంగా ఎలా ఇంట్లో రాకుండా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ఈగల బాధ తగ్గించుకోండి
కర్పూరం:
కర్పూరం వాసన ఈగలకు నచ్చదు. కాబట్టి మీ ఇంట్లో ఈగల బాధ ఎక్కువగా ఉంటే, కర్పూరం వెలిగించి దాని పొగను ఇల్లు అంతా వ్యాపింపజేయండి. దీనివల్ల ఈగలు వెంటనే మీ ఇంటి నుండి పారిపోతాయి.
ఉప్పు:
ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి బాగా మరిగించి చల్లారనివ్వండి. తర్వాత ఒక స్ప్రే బాటిల్‌లో ఆ నీటిని పోసి దాన్ని ఇల్లు అంతా చల్లితే ఈగలు పారిపోతాయి.
ఈగల బాధ తగ్గించుకోండి
వెనిగార్:
ఈగలకు వెనిగార్ వాసన నచ్చదు. కాబట్టి ఒక స్ప్రే బాటిల్‌లో కొద్దిగా వెనిగార్, యూకలిప్టస్ ఆయిల్ వేసి బాగా కలిపి, ఈగలు వచ్చే చోట చల్లితే ఈగలు ఇంట్లోకి రావు.
లవంగాలు:
ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి దానిపై లవంగాలను పెడితే, ఈగలు ఆ వాసనకు ఇంట్లోకి రావు.
ఈగల బాధ తగ్గించుకోండి
నిమ్మకాయ:
ఒక స్ప్రే బాటిల్‌లో నిమ్మరసం, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి ఈగలు ఉన్న చోట చల్లితే ఈగలు ఇంటి నుండి పారిపోతాయి.
పుదీనా లేదా తులసి:
ఇంట్లో ఉండే ఈగలను వెళ్లగొట్టడానికి పుదీనా లేదా తులసి ఆకులు ఉపయోగపడతాయి. వీటిలో దేనినైనా పేస్ట్ లాగా నూరి దాన్ని నీటిలో కలిపి ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి ఈగలు ఎక్కువగా ఉండే చోట చల్లితే ఈగలు ఇంటి నుండి పారిపోతాయి.