నల్లని పెదాలు ఎర్రగా మారాలంటే ఇలా చేయండి..
కొందరి పెదాలు ఎర్రగా.. ముద్దుగా ఉంటే.. మరికొందరివి మాత్రం నల్లగా ఉంటాయి. అయితే పెదాలు నల్లగా మారడానికి కారణం ఏదైనా వ్యాధి కావొచ్చు లేదా సిగరేట్ తాగడం వల్లా కావొచ్చు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో నల్లని పెదాలను ఎర్రగా మార్చుకోవచ్చు.

మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడంలో దుస్తులు ఎంత ప్రాముఖ్యతను వహిస్తాయో.. మన శరీర పరిశుభ్రత కూడా అంతే వహిస్తుంది. అందుకే పరిశుభ్రత విషయంలో ఏమాత్రం తగ్గకూడదు. ఇక బట్టలంటారా.. మనకు నప్పే.. వాటిని వేసుకుంటే సరిపాయే. ఇకపోతే కొంతమంది పెదాలు చూడటానికి చక్కగా.. అందంగా గులాబీ రంగులో మెరిసిపోతుంటాయి. మరికొంతమంది పెదాలు మాత్రం నల్లగా.. అందవిహీనంగా ఉంటాయి. అయితే సిగరేట్లు తాగడం.. కొన్ని రకాల అనారోగ్య సమస్యల కారణంగా పెదాలు నల్లగా అవుతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఎంత నల్లగా ఉండే పెదాలైనా ఎర్రగా నిగనిగలాడుతాయి. ఆ చిట్కాలేంటో చూసేద్దాం పదండి..
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. దీనిని సలాడ్ రూపంలో తిసుకున్నా.. ఎన్నో పోషకాలు అందుతాయి. బీట్ రూట్ సహజ అందాన్ని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే నల్లని పెదాలను రెడ్ గా మార్చాలంటే బీట్ రూట్ జ్యూస్ లో కొద్దిగా తేనెను మిక్స్ చేయండి. దీన్ని పెదాలకు అప్లై చేయండి. రెగ్యులర్ ఈ పద్దతిని ఫాలో అయితే కొన్ని రోజుల్లోనే మీ పెదాలు పింక్ కలర్ లోకి మారిపోతాయి.
నిమ్మకాయ, చక్కెర
వేసవిలో చాలా మంది నిమ్మరసంలో చక్కెరను కలుపుకుని బాగా తాగుంటారు. ఎందుకంటే ఇది వేసవి దాహాన్ని తీర్చడంతో పాటుగా... బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది. నిమ్మకాయలో బ్లీచింగ్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి చనిపోయిన కణాలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకోసమే చాలా మంది నిమ్మకాయను ముఖానికి అప్లై చేస్తుంటారు. అయితే దీన్ని ముఖానికే కాదు పెదాలకు కూడా అప్లై చేయొచ్చు. ఇందుకోసం నిమ్మకాయను సగంగా కోసి.. అందులో ఒకదాన్ని తీసుకుని దానిపై కొంచెం చక్కెరను వేయండి. దీన్ని పెదాలకు స్క్రబ్ లా ఉపయోగించండి. దీన్ని రెగ్యులర్ గా ఫాలో అయితే కొన్ని వారాల్లోనే మీ పెదాలు ఎర్రగా మారుతాయి.
కలబంద జెల్
కలబంద రసం ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అయితే దీనిలో అందాన్ని సహజంగా మెరిపించే లక్షణాలు కూడా ఉంటాయి. దీన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అయితే ఈ కలబంద గుజ్జుతో లిప్ బామ్ ను కూడా తయారుచేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా పెదాలకు అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేస్తే మంచి ఫలితాలను పొందుతారు.