Easy Money డబ్బులు ఊరికే రావాలా.. ఇవి ఇంట్లో పెట్టుకోండి!
ప్రతి ఒక్కరి జీవితంలో చాాలా సమస్యలకు మూలం ఆర్థిక ఇబ్బందులే. ఆర్థికంగా కుదురుకుంటే వాళ్ల జీవితాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఎక్కువ ఖర్చులతో మీరు చాలా ఇబ్బంది పడుతుంటే, వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోండి.

ఇవి ఇంట్లో పెట్టుకోండి!
కొన్నిసార్లు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే అన్ని రకాల సమస్యలు వస్తాయి. వాటిలో ఒకటి డబ్బు కొరత లేదా ఆర్థిక ఇబ్బంది. కానీ ఈ సమస్యకు వాస్తు శాస్త్రంలో పరిష్కారాలు ఉన్నాయి.
వెండి ఏనుగు విగ్రహం:
సాధారణంగా ఇంటిని అందంగా చూపించడానికి చాలా రకాల వస్తువులు కొంటాం. వాస్తు ప్రకారం ఇంట్లో వెండి ఏనుగు విగ్రహం పెట్టుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
చేప విగ్రహం
చేప విగ్రహం ఆరోగ్యం, బలం, సంపద, సంతోషానికి చిహ్నం. కాబట్టి వాస్తు ప్రకారం వెండి లేదా ఇత్తడితో చేసిన చేప విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది.
వేణువు
ఇంట్లో వేణువు ఉంటే సంతోషం, సంపద పెరుగుతాయని వాస్తు శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే వేణువు సంపదను ఆకర్షిస్తుంది. కాబట్టి మీ ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో వేణువును ఉంచండి.
ఒంటి కన్ను కొబ్బరికాయ
సాధారణంగా మనం ఉపయోగించే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి. కానీ ఒంటి కన్ను కొబ్బరికాయ అరుదుగా దొరుకుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఇది ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.