- Home
- Life
- Omicron Symptoms in Kids : మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త అది కరోనా కావొచ్చు..
Omicron Symptoms in Kids : మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త అది కరోనా కావొచ్చు..
Omicron Symptoms in Kids : చిన్నపిల్లలు కూడా విపరీతంగా కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి పిల్లల్లో కొన్నిరకాలైన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి లక్షణాలు గనుక మీ పిల్లల్లో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అవన్నీ కరోనా లక్షణాలు కాబట్టి. మరి ఎలాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా అని నిర్దారించుకోవాలో తెలుసా..

Omicron Symptoms in Kids : కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపుతూ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పెద్ద వారు చిన్నపిల్లలు అంటూ తేడా లేకుండా అందరికీ సోకుతోంది. అయితే పెద్దల్లో మాదిరిగానే చిన్న పిల్లల్లో కూడా ఈ కరోనా లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పిల్లలు కరోనా లేదా ఒమిక్రాన్ బారిని పడితే కొన్నిరకాలైన లక్షణాలు కనిపిస్తున్నాయి. వాటి ద్వారానే వారు కొవిడ్ కు గురయినట్టు తెలుసుకోవచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
University of Pittsburgh study ప్రకారం.. కొవిడ్ సోకడంతో హాస్పటల్లో చేరిన పిల్లల్లో ఎక్కువ శాతం నరాలకు సంబంధించిన లక్షణాలతోనే బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కాగా కొవిడ్ బారిన పడి హాస్పటల్లో చేరిన పిల్లలందరిలో సుమారుగా 44 శాతం మంది పిల్లలు నరాలకు సంబంధించిన లక్షణాలతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా Journal of Pediatric Neurology లో ప్రచురితమైంది. అంతేకాదు కరోనా బారిన పడిన పిల్లల్లో చాలా మందిలో నాడీకి సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకిన పిల్లల్లో శారీరకంగానే కాదు మానకసికంగా కూడా వారిపై ప్రభావం చూపుతోందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి.
ఈ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ చిన్న పిల్లలకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సినేష్ ప్రాసెస్ జరగడం లేదు. దీని మూలంగానే పిల్లలు ఎక్కువగా కొవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కొవిడ్ లక్షణాలు ఒక్కటి కనిపించినా ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒకవేళ మీ పిల్లలకు జ్వరం, తీవ్రమైన తలనొప్పి వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించండి. కొవిడ్ టెస్టులు చేయించండి. ఇవి సీజనల్ వ్యాధులే అని నిర్లక్ష్యం అస్సలు చేయకండి. ఎందుకంటే అవి కొవిడ్ లక్షణాలు కూడా కాబట్టి. కొవిడ్ సోకడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగానే పిల్లల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కూడా కొవిడ్ Symptoms యే కాబట్టి టెస్టులు తప్పని సరిగా చేయించాలి. ఒళ్లు నొప్పులు, తీవ్రమైన జ్వరం వచ్చినా అది కొవిడ్ గానే అనుమానించాలి. ఇది మామూలు జ్వరమే అని మీరే నిర్దారించుకుని మీకు తోచిన మెడిసిన్స్ ను ఇవ్వడం ప్రమాదకరం. అందుకే టెస్టులు చేయించడం ఉత్తమమైన పని. అందులోనూ కొవిడ్ కు గురైన పిల్లలు మానసికంగా చాలా క్రుంగి పోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. తెలుపుతున్నారు.