Beauty Tips: ఒత్తైన జుట్టు కావాలా.. అయితే ఇలా ట్రై చేయండి?
Beauty Tips: వంటింట్లో ఉండే దినుసులతోనే ఎన్నో అద్భుతమైన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయని తెలుసా.. అందులో ఒకటి మనం వంటకి ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్ మీ జుట్టుకి కూడా దివ్య ఔషధం. అదెలాగో చూద్దాం.

అందానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే వెంటనే పార్లర్ దగ్గరకో ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోవటం నేటి తరం వాళ్లకి బాగా అలవాటు. అయితే మన వంటింట్లోనే దివ్య ఔషధాలు ఉన్నాయి వాటి వైపు చూడడం లేదు. నాటికరం వారు వీటిని వాడే అద్భుతమైన ఫలితాలను సాధించేవారు.
అలాంటి వంటింటి ఔషధం లో ఒకటి మనం వంటకి వాడే వెజిటబుల్ ఆయిల్ ఇది జుట్టుకి కూడా దివ్య ఔషధం. జుట్టు చివర్లు చిట్లినా కాంతి పోయినా వెజిటబుల్ ఆయిల్ వాడటం వల్ల తిరిగి అందమైన జుత్తిని సొంతం చేసుకోవచ్చు.
Photo Courtesy: Instagram
ఆ పద్ధతి ఎలాగో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ మరియు ద్రాక్ష విత్తనాల నూనెలని తీసుకొని ఒక గిన్నెలో కలుపుకోవాలి. 10 సెకండ్ల పాటు ఈ ఆయిల్ ని వేడి చేసుకోవాలి.
ఈ నూనె లో లావెండర్ రోజ్ మేరీ వంటి సుగంధ తైలాలను కూడా కలుపుకోవచ్చు మరియు నూనె రెండు చుక్కలు ఈ వేడి నూనెకి జోడించండి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. నూనె వేడి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగానూ కాకుండా చూసుకోండి
గోరువెచ్చగా ఉండే నూనెతో మీ తలపై ఉండే చర్మంపై మర్దనా చేస్తూ జుట్టు చివరి వరకు నూనెతో రాయండి. ప్రతి విభాగంలోనూ జుట్టును ఇదేవిధంగా మర్దనా చేయండి. తర్వాత గాలి తగలకుండా ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఉంచండి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే హీటింగ్ కేప్ కింద ఒక 15 నిమిషాలు కూర్చోండి.
లేదంటే తలపై ఒక వేడి టవల్ని చుట్టుకుని ఆ టవల్ కి ఇంకొక టవల్ చుట్టండి. కాసేపటి తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి. ఇలా తరచుగా చేస్తూ ఉండడం వల్ల మీ జుట్టులో కచ్చితంగా మార్పుని చూస్తారు.