- Home
- Life
- Social Media: మీ జెనరేషన్ జెడ్ పిల్లలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్ని గంటలు గడుపుతున్నారో తెలుసా? వెంటనే అడ్డుకోండి
Social Media: మీ జెనరేషన్ జెడ్ పిల్లలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్ని గంటలు గడుపుతున్నారో తెలుసా? వెంటనే అడ్డుకోండి
నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం విధించారని Gen Z యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ జరిగిన మారణహోమంలో 16 మంది మరణించారు. ప్రధాని ఇంటికి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో యువత సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలుసుకోవాలి.

Gen Z లో సోషల్ మీడియా క్రేజ్
నేటి డిజిటల్ ప్రపంచంలో Gen Z (1997-2012 మధ్య జన్మించిన) యువత పూర్తిగా సాంకేతికత, సోషల్ మీడియాతోనే కలిసి జీవిస్తున్నారు. వీరిని డిజిటల్ నేటివ్స్ అని పిలుస్తారు. వీరు తమ స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ ప్లాట్‌ఫారమ్‌లను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరు. వాటిలోనే ఎక్కువ జీవితాన్ని గడిపేస్తున్నారు.
Gen Z సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతుంది?
ముంబైనికి చెందిన vicino tech సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, Gen Z యువత ప్రతిరోజూ సుమారు 4-6 గంటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతుంది. వారు Instagram రీల్స్, స్టోరీలు, YouTube షార్ట్ వీడియోలు, Snapchat, Reddit, మీమ్స్, పీర్-జనరేటెడ్ కంటెంట్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ సమయంలో ఎక్కువ భాగం షార్ట్ వీడియోలు, స్టోరీలను చూడటానికి వెచ్చిస్తారు, వీటి ద్వారా వారి దృష్టిని వెంటనే ఆకర్షించి, వారు నిరంతరం స్క్రోల్ చేస్తూ ఉంటారు.
Gఎక్కువగా ఉపయోగించే యాప్‌లు ఏవి?
Instagram: రీల్స్, స్టోరీల కోసం
YouTube: షార్ట్ వీడియోలు, ట్యుటోరియల్స్ కోసం
Snapchat: స్నేహితులతో ప్రత్యక్ష సంభాషణ కోసం
Reddit: మీమ్స్, కమ్యూనిటీ చర్చలు, ట్రెండింగ్ అంశాల కోసం
Gen Z ఏ రకమైన కంటెంట్‌ను ఇష్టపడుతుంది?
- షార్ట్-ఫామ్ వీడియోలు, అంటే 15-30 సెకన్ల రీల్స్ లేదా షార్ట్స్.
- మీమ్స్, వీటిలో కామెడీ, రాజకీయాలు, చమత్కారమైన వ్యాఖ్యలు ఉంటాయి.
- పీర్-జనరేటెడ్ కంటెంట్, ఇక్కడ నిజమైన వ్యక్తులు, వాస్తవ కథలు ఉంటాయి.
మీ పిల్లలను గమనించండి
నిపుణులు చెబుతున్న ప్రకారం, ప్రతిరోజూ మీ పిల్లలు ఫోన్ ఎంత సేపు వాడుతున్నారో తెలుసుకోండి. వారు 4 నుంచి 6 గంటలు సోషల్ మీడియాలో గడపడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల కళ్ళు, నిద్రపై ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం, వాస్తవ సామాజిక సంబంధాలు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి.