Yoga day 2022: యోగా చేస్తున్నప్పుడు పొరపాటున కూడా చేయకూడని తప్పులివే... ఏంటో తెలుసా?
Yoga day 2022: ప్రస్తుత కాలంలో మన ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం.

ఇలా తరుచు అనారోగ్యాలకు గురవడం పట్ల ప్రజలు ఆరోగ్యం పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండటం కోసం చాలా మంది యోగా చేయడం చేస్తుంటారు. అయితే ఈ యోగా చేసే సమయంలో చాలామంది తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్లు చాలా ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ పొరపాటు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం...
సాధారణంగా యోగా చేసేటప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం ఎంతో అవసరం. వాతావరణం ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉన్న యోగ చేయకూడదు. యోగ శరీర ఉష్ణోగ్రత పై ప్రభావం చూపుతుంది కనుక సరైన వాతావరణ పరిస్థితులలో మాత్రమే యోగ చేయాల్సి ఉంటుంది. యోగా చేసే వారు ఒకేసారి కష్టతరమైన ఆసనాలను చేయకూడదు. నెమ్మది నెమ్మదిగా కష్టతరమైన ఆసనాలను చేస్తూ వెళ్లాలి.
చాలామంది భోజనం చేసిన తర్వాత యోగా చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ పొరపాటు ఎప్పుడు చేయకూడదు భోజనం చేసిన వెంటనే యోగా చేయడం వల్ల ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థ పై పడుతుంది. అందుకే భోజనం చేసిన రెండు లేదా మూడు గంటల వ్యవధి తరువాత యోగా చేయాలి. ఎప్పుడైతే మనకు మన శరీరం సహకరించదో ఆ సమయంలో పొరపాటున కూడా యోగ చేయకూడదు.మనం యోగ చేస్తున్న సమయంలో మన శరీరంలోని అన్ని అవయవాల కదలిక ఉంటుంది. కనుక శరీరం మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది అందుకే శరీరం సహకరించని సమయంలో యోగ చేయకూడదు.
ఇక యోగ చేసే వారు ప్రస్తుత కాలంలో యూట్యూబ్ లో వస్తున్నటువంటి వీడియోలను చూసి సరికొత్త ఆసనాలను చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలా యూట్యూబ్ వీడియోలు ఫేస్ బుక్ వీడియోలు చూసి యోగాసనాలు చేయకూడదు. ఇకపోతే యోగా చేసినప్పుడు వీలైనంతవరకు వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి.బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల కొన్ని ఆసనాలు చేసేటప్పుడు గట్టిగా శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో బిగుతైన దుస్తులు ధరించినపుడు ఆ ప్రభావం ఊపిరితిత్తులు, ప్రక్కటెముకల పై పడుతుంది.
ఇకపోతే చాలామంది యోగా చేసిన వెంటనే స్నానం చేయడానికి ఇష్టపడుతుంటారు. పొరపాటున కూడా స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే యోగా చేసే సమయంలో మన శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరిగి ఉంటుంది. అలాంటి సమయంలో స్నానం చేసి ఒక్కసారిగా మన శరీరాన్ని చల్లపరచ కూడదు.అందుకే యోగా చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని అనంతరం స్నానం చేయాలి.