ఆదివారం నాడు ఈ పనులను అస్సలు చేయకండి..
సండే ఫన్ డే. ఈ రోజున ఎన్నో పనులను చేయాలని ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. వాటిని చేస్తారో, చేయరో.. ఈ రోజు చివరన గుర్తూ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ రోజు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఈ ఫన్ డే స్పాయిల్ అయినట్టే మరి..

రాత్రిపూట మద్యం సేవించడం: సండే వచ్చిందంటే చాలు చాలామంది ఈ రోజు రాత్రి సమయంలో ఫుల్ గా తాగి ఎంజాయ్ చేయాలనకుంటారు. కానీ ఈ రోజు నైట్ కి ఆల్కహాల్ తాగితే రేపు పొద్దున్న మీరు హ్యాంగోవర్ బారిన పడటం పక్కాగా జరుగుతుంది. దాంతో మీరు రేపు పనులను చేయలేరు. కాబట్టి అంతగా తాగితే.. మోతాదులోనే తాగండి.
కేలరీల ఆహారం: సండే ఏ పని ఉండదని చాలా మంది బయటిఫుడ్ ను తినడానికి ఇష్టపడుతుంటారు. అలా తినడంలో తప్పు లేదు కానీ అధిక కేలరీల ఫుడ్ తీసుకుంటే మాత్రం మీరు పొట్టకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కేలరీల ఫుడ్ మోతాదులోనే తినండి.
postponed
వాయిదా వేయడం: సండే ఫన్ డే ఏ పని చేయను ఈ రోజు అంటూ.. నిర్లక్ష్యంగా ఉండకండి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయండి. దీంతో మీరు పనిలో ఒత్తిడికి గురికావాల్సిన అవసరం ఉండదు.
Over work: ఉద్యోగం పట్ల అంకిత భావం ఉండటం మంచి విషయమే కానీ.. ఆదివారం కూడా మీరు పనిలోనే గడపడం అంత గొప్ప విషయమైతే కాదు. ఈ రోజు కూడా మీరు మీ ఆఫీస్ వర్క్ చేస్తే మీ బాస్ మెచ్చుకుంటారేమో కానీ.. దాని వల్ల మీకు వచ్చే లాభమేమీ లేదు. ఆదివారం కూడా మీ ఆఫీస్ వర్కే చేస్తే .. మీ ఫన్ డే వేస్ట్ అయినట్టే.
Over sleep: ప్రతి రోజూ వర్క్ ఉంటుంది కాబట్టి కాస్త ముందుగానే లేస్తుంటారు. అయితే నిద్ర సరిపోవడం లేదనుకుంటే ఆదివారం ఉదయం పూట 9 గంటలకు లేవండి. కానీ ఆ రోజంతా అలాగే పడుకుని ఈ రోజును నాశనం చేయకండి.
షాపింగ్ : ఆదివారం హాళీ డే కాబట్టి ఈ రోజు షాపింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు మీరు ఏమేం కొనాలనుకుంటున్నారో కొనేయండి.
వ్యాయామం: ఆదివారం కూడా జిమ్ కు వెళ్లాలా, వ్యాయామం చేయాలా? ఈ ఒక్క రోజు వ్యాయామం చేయకపోతే ఏమీ కాదులే అనుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ రోజు వ్యాయామం వద్దనుకునే వారు బయట కాసేపు అలా అలా నడవండి. మీ శరీరం రిలాక్స్ గా ఫీలవుతుంది.
back to work
ఆది వారం అది చేయాలి.. ఇది చేయాలి అని ఎన్నో ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకునే వారు చాలా మందే ఉన్నారు కానీ .. ‘ఏమీ చేయరు’ఇదైతే నిజమే కదా..