ఈ దీపావళికి మీ ఇంట్లోని సోఫాలను చాలా ఈజీగా క్లీన్ చేసే ట్రిక్స్ మీకోసం..!
Diwali 2023: దీపావళి రాగానే ఇంటినంతా క్లీన్ చేసే పనిలో మునిగిపోతారు. అయితే చాలా మంది సోఫాలను కూడా శుభ్రం చేస్తుంటారు. కానీ వీటిని క్లీన్ చేయడం అంత సులువైన పనేం కాదు. కానీ కొన్ని టిప్స్ ను, ట్రిక్స్ ను ఫాలో అయితే మాత్రం రూపాయి ఖర్చు లేకుండా చాలా నీట్ గా వీటిని క్లీన్ చేసేయొచ్చు. అవేంటంటే?
Diwali 2023: దీపావళి రాగానే ఇంట్లోని ప్రతి మూలను శుభ్రం చేస్తుంటాం. ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రమైన ఇంట్లోనే నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. అందుకే పండుగకు ముందునుంచే ఇంటిని క్లీన్ చేసే పనిలో పడతారు. దీపావళికి చాలా మంది ఇంటికి పెయింటింగ్ వేయిస్తారు. అలాగే ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ను కూడా క్లీన్ చేస్తారు. ఇల్లు అందంగా మారినా.. ఇంట్లోని ఫర్నీచర్ పై దుమ్ము విపరీతంగా పేరుకుపోతుంది. కానీ వీటిని క్లీన్ చేయడం అంత ఈజీ కాదు.
సోఫాలను క్లీన్ చేయాలనే ఆలోచనే రాదు చాలా మందికి. కానీ వీటికే ఎక్కువ దుమ్ము అంటుకుంటుంది. ఇలా దుమ్ము పట్టిన వాటిని ఎవరు క్లీన్ చేస్తారని చాలా మంది వాటిని పారేస్తుంటారు. కానీ దుమ్ము కొద్దిగా ఉన్నప్పుడే క్లీన్ చేస్తే వీటిని ఎన్నో ఏండ్ల వరకు వాడుకోవచ్చు. పాతవాటిలా కూడా కనిపించవు. ఇక కొంతమంది అయితే డబ్బులు ఖర్చు పెట్టి మరీ సోఫాలను క్లీన్ చేస్తుంటారు. కానీ మీరే కొన్ని సింపుల్, ఎఫెక్టీవ్ టిప్స్, ట్రిక్స్ తో వీటిని తొందరగా క్లీన్ చేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం పదండి.
లెదర్ సోఫా
నిజానికి లెదర్ సోఫాలను క్లీన్ చేయడం చాలా ఈజీ. అవును వీటిని క్లీన్ చేయడానికి మార్కెట్ లో క్లీనర్ దొరుకుతుంది. అయితే అలాంటి సోఫాను ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కూడా వీటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం నీటిని, వెనిగర్ ను కలపండి. దీనిలో ఒక క్లీన్ గుడ్డను ముంచి దానితో సోఫాను తుడవండి. లెదర్ సోఫా అందంగా కనిపించడానికి వెనిగర్ లో లిన్ సీడ్ ఆయిల్ వేసి తుడవండి.
ఫ్యాబ్రిక్ సోఫా
ఫ్యాబ్రిక్ సోఫాను క్లీన్ చేయడం కొంచెం కష్టమే. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ లేత రంగులో ఉంటే.. అయితే కొన్ని టిప్స్ తో దీన్ని కూడా అందంగా మార్చేయొచ్చు మరి. ఈ సోఫాపై ఉన్న మరకలను పోగొట్టేందుకు ఒక గిన్నెలో లేదా డిటర్జెంట్ లో స్నానం చేసే సబ్బు చిన్న చిన్న ముక్కలను వేయండి. దీనిలో ఒక కప్పు కాచి చల్లార్చిన నీటిని కలపండి. అలాగే మీరు లిక్విడ్ సబ్బును కూడా ఉపయోగించొచ్చు. ఇప్పుడు దీనిలో రెండు టీస్పూన్ల అమ్మోనియాను కలపండి. ద్రావణాన్ని కాసేపు అలాగే ఉంచండి. తర్వాత షేక్ చేసి నురుగులా చేసి అందులో శుభ్రమైన గుడ్డను ముంచి నీరు ఎక్కువగా లేకుండా పిండి సోఫాను తుడవండి.
వెల్వెట్ సోఫా
వెల్వెట్ సోఫాను క్లీన్ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎందుకంటే ఈ సోఫాపై దుమ్ము, ధూళి ఎక్కువగా పేరుకుపోతుంది. దానిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించడం. దీనిని ఉపయోగించడం వల్ల సోఫాపై పేరుకుపోయిన మురికి చాలా వరకు తొలగిపోతుంది. అలాగే మృదువైన డిటర్జెంట్ ను ఉపయోగించి కూడా సోఫాను క్లీన్ చేసుకోవచ్చు.