Recipes: కమ్మనైన కర్డ్ సాండ్విచ్.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం?
Recipes: ఇంట్లో పిల్లలు చిరుతిండి కోసం గోల పెడుతున్నారా.. అయితే అప్పటికప్పుడు చేసుకునే కర్డ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మీ పిల్లలు చిరుతిండి కోసం ఒకటే మారం చేస్తున్నారా.. లేదా మీకే వేడివేడిగా తక్కువ సమయంలో చేసుకునే స్నాక్స్ కావాలనిపిస్తుందా అయితే ఈ కోడ్స్ అండ్ విచ్ మీ కోసమే. ముందుగా దీనికోసం బ్రెడ్ ముక్కలు నాలుగు, ఒక గుప్పెడు క్యాబేజీ తురుము, గుప్పెడు దోసకాయ తురుము, ఉల్లిపాయ తురుము ఒక గుప్పెడు.
క్యాప్సికం తురుము ఒక గుప్పెడు, పెరుగు నాలుగు టేబుల్ స్పూన్లు, నువ్వుల గింజలు ఒక స్పూను, చాట్ మసాలా పావు టీ స్పూన్, ఎర్ర మిరపకాయలు పావు టీ స్పూన్, రుచికి తగినంత ఉప్పు, తగినంత వంట నూనె తీసుకోవాలి.
ముందుగా సాండ్విచ్ చేయటానికి ఒక గిన్నెని తీసుకొని అందులో నాలుగు స్పూన్ల పెరుగు వేయండి. ఇప్పుడు క్యాబేజీ తురుము, దోసకాయ తురుము, క్యాప్సికం తురుము అందులో వేయండి. బాగా కలిపినా తలు తరువాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఇప్పుడు మళ్లీ బాగా కలపండి.
ఇప్పుడు బ్రెడ్ ముక్కలని తీసుకొని బ్రౌన్ అంచులు మొత్తం కత్తిరించండి. ఇప్పుడు తెల్లని బ్రెడ్ ముక్కపై మనం సిద్ధం చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అంగుళం మందంలో స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దాని మీద మరొక బ్రెడ్ ముక్కని పెట్టి సాండ్విచ్ ని సిద్ధం చేయండి.
అలాగే మిగిలిన రెండు బ్రెడ్ ముక్కలలో కూడా మిశ్రమాన్ని పెట్టి మరొక సాండ్విచ్ ని ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మంట మీద పాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేయండి. ఇప్పుడు సిద్ధం చేసిన శాండ్విచ్ ని పాన్లో వేసి బాగా కలపండి కొంచెం సమయం తర్వాత సాండ్విచ్ ని తిప్పండి.
రెండువైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అంతే రుచికరమైన కార్డ్స్ అండ్ విచ్ రెడీ ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఉపయోగపడుతుంది సాయంత్రం స్నాక్స్ గాను ఉపయోగపడుతుంది ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఒక ఆహార పదార్ధము లేదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.