MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Carrots benefits : బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు , కాలెయ ఆరోగ్యానికి ఖచ్చితంగా క్యారెట్ తినాల్సిందే..

Carrots benefits : బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు , కాలెయ ఆరోగ్యానికి ఖచ్చితంగా క్యారెట్ తినాల్సిందే..

Carrots benefits : భయంకరమైన బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి తొందరగా బయటపడాలన్నా, కాలెయం ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతి రోజూ క్యారెట్ తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్యారెట్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి తెలుసా..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 28 2022, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Carrots benefits : క్యారెట్ సమతుల్య ఆహారం. ఇందులో బోలెడన్ని పోషకాలుంటాయి. ప్రతి రోజూ వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వీటిని శీతాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వంటల్లో కూడా ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాదు ఈ క్యారెట్ లను హల్వా, బర్పీ, గజర్ పాక్ వంటి desserts తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.  అయితే వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి.  

26
liver

liver

కాలెయ ఆరోగ్యం:  క్యారెట్ లల్లో బీటా కెరోటిన్, ప్లాంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి కాలెయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఇవి కాలెయ పనితీరును కూడా సులభతరం చేస్తాయి.  ముఖ్యంగా ఇవి లివర్ పై Toxicity చేయనివ్వవు. కాలెయ పనితీరు మెరుగుపడటానికి తప్పని సరిగా క్యారెట్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని అలాగే తిన్నా లేకపోతే జ్యూస్ గా చేసుకుని తాగిన చక్కటి ఫలితం ఉంటుంది. ఈ క్యారెట్ జ్యూస్ రుచిగా డిఫరెంట్ గా ఉండాలనుకుంటే.. నల్ల మిరియాలు, అల్లం, వెల్లుల్లి, దోసకాయలను క్యారెట్ కు జోడించి జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. 

36


క్యాన్సర్: క్యారెట్ లల్లో ఫల్కారినోల్ అనే రసాయన సమ్మేళనం మెండుగా ఉంటుంది. ఇది ప్రమాదకరమైన కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారిస్తుంది. అంతేకాదు జట్టు, చర్మ సంరక్షణకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్  వృద్ధి చెందకుండా అడ్డుగా నిలుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతంది. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు కూడా నిరూపించాయి. క్యాన్సర్ ఉన్న వారు క్రమం తప్పకుండా క్యారెట్ లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందట. కాబట్టి క్యాన్సర్ తో బాధపడేవారు క్యారెట్ లను అలాగే తిన్నా.. లేకపోతే సూప్ గా చేసుకొని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. అయితే వీరు సేంద్రీయ వ్యవసాయం పద్దతిలో పండిచిన క్యారెట్ లను తీసుకుంటే మరీ మంచిది.

46

మధుమేహం: ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. వీరు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాగా డయాబెటీస్ పేషెంట్లు క్యారెట్ లను తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయన్న భయం లేదు. ఈ క్యారెట్ల లల్లో విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటీస్ ఉన్నవారికి దివ్య ఔషదంలా పనిచేస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారు క్యారెట్ జ్యూస్ కు బదులుగా క్యారెట్ లనే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా శరీరంలోని Sugar level readings ప్రకారమే క్యారెట్ రసం తీసుకోవాల్సి ఉంటుంది.

56

ఇతర ప్రయోజనాలు: కంటి ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, మెరిసే చర్మం కోసం, హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించి, జుట్టును పెంచడానికి క్యారెట్ ఎంతో సహాయపడుతుంది. 

66
carrots

carrots

హెచ్చరికలు: ఏది అతిగా తిన్నా అనర్థమే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే.. క్యారెట్ తో అధిక ప్రయోజనాలున్నాయని అదే పనిగా క్యారెట్లను తింటే బీటా కెరోటిన్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రక్తం కరాబయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు స్కిన్ కలర్ కూడా మారుతుంది. దీనినే కెరోటినిమా అని కూడా పిలుస్తారు. కాబట్టి క్యారెట్లను మోతాదుకు మించి తినకండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ 3 పనులు చేస్తే నెలలో బరువు తగ్గుతారు
Recommended image2
Silver: బంగారంతో పని లేకుండా లో బడ్జెట్ వెండి ఇయర్ రింగ్స్
Recommended image3
5 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఎంత బాగున్నాయో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved