Blood pressure: బీపీ పేషెంట్లు టీ తాగకూడదా..?
High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి ఎలాంటి ఆహారం మంచిది.? ఏది తీసుకోవాలి? ఏది తీసుకోకూడదు అన్న విషయాలపై చాలా సందేహాలున్నాయి. ఇదే క్రమంలో వీరు టీని తాగకూడదన్న సందేహాలు కలుగుతున్నాయి.

High Blood Pressure: మారుతున్న జీవన శైలి, మన ఆహారపు అలవాట్లు మొదలైన వివిధ కారణాల వల్ల అధిక బరువు, హైబీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు సర్వసాధారణంగా అయ్యాయి. ఈ సమస్యలు మాములుగానే కనిపించినా.. వీటి పట్ల కేరింగ్ ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే ప్రస్తుత సమాజంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. నీళ్లు సరిగ్గా తాగకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల హైబీపీ సమస్య తలెత్తుతుంది. రక్తపోటు సమస్యతో బాధపడేవారు తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఉండేట్టుు చూసుకోవాలి. దీనివల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. ఉప్పును ఎంత తక్కువ తీసుకుంటే వీరి ఆరోగ్యం అంత బాగుంటుంది.
అయితే బీపీ పేషెంట్లు అసలు టీ తాగొచ్చా? లేదా? అన్న సందేహాలు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ తాగితే బీపీ ఏమీ పెరగదని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఈ సమస్యతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలున్న వారు మాత్రం టీని ఎట్టిపరిస్థితిలో తాగకూడదని నిపుణులు సలహానిస్తున్నారు. ఒకవేళ తాగాలనుకుంటే డాక్టర్ ను సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు.
అధిక రక్తపోటు తో పాటుగా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నవారు టీ ని ఎట్టిపరిస్థితిలో తాగకూడదని నిపుణులు సలహాలనిస్తున్నారు. పేషెంట్లు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఉంటే వారు కూడా టీని తాగకూడదట. ఇలాంటి సమయంలో టీని తాగితే బీపీ మరింత పెరిగే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే హై బీపీ పేషెంట్లకు మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తే వారు కూడా టీని తాగకూడదు. ఇలాంటి వారు టీని మోతాదుకు మించి తాగితే కడుపులో, ఛాతిలో మంట సమస్య వస్తుంది. బీపీ ఉన్నవారైనా లేనివారైనా.. పరిగడుపున టీని అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరిగడుపున టీని తాగితే ఎవ్వరికైనా బీపీ పెరుగుతుంది. తద్వారా ఛాతిలో మంటగా అనిపిస్తుంది.
అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వాళ్లు కెఫిన్ ను మోతాదుకు మించి అస్సలు తీసుకోకూడదు. కెఫిన్ బీపీ పేషెంట్లకు ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా వీరు ఉప్పు-సోడియం ను ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు. సోడియం వల్ల బీపీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లు ఉప్పును తక్కువగానే తీసుకోవాలి.
ప్యాకెట్ ఫుడ్స్ అయిన చిప్స్, ఊరగాయలు వంటి సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలకు బీపీ పేషెంట్లు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిది. హైబీపీ సమస్య ఉన్నవాళ్లు స్మోకింగ్ కు, ఆల్కహాల్ ను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. వీటివల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
బీపీ కంట్రోలో అవ్వాలంటే ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే హెల్తీగా, ఫిట్ గా ఉంటారు. సాధారణ రక్తపోటు కంటే ఎక్కువగా ఉండే విపరీతమైన తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు మరింత తీవ్రతరమైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.