కొలెస్ట్రాల్ ను తొందరగా తగ్గించే బెస్ట్ ఫుడ్స్
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె పోటు, స్ట్రోక్, ఊబకాయం, డయాబెటీస్ వంటి ఎన్నో ప్రాణాంతక సమస్యలు వస్తాయి.
cholesterol
'చెడు' కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఏం జరుగుతుంది
మీ శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అది మీ రక్తనాళాల గోడలపై కొవ్వు నిల్వలు లేదా 'ప్లేక్' పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే ఆరోగ్యంగా తినడంతో పాటుగా ప్రాసెస్ చేసిన, ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకోవాలి. అలాగే ధూమపానం, మద్యపానం చేయకూడదు. కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా తగ్గడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కరిగే ఫైబర్
కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ కరిగే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంచేందుకు సహాయపడుతుంది. చిక్కుళ్ళు, కిడ్నీ బీన్స్, తృణధాన్యాలు, బ్రస్సెల్ మొలకల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
healthy fats
గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు
ఆరోగ్యకరమైన గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అనారోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడాన్ని తగ్గిస్తాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. గింజలు, అవకాడోలు వంటి మరిన్ని ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోండి.
ఫ్యాటీ ఫిష్
సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపలు మంచి కొవ్వులకు అద్భుతమైన మూలాలు. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
కూరగాయల నూనె కంటే ఆలివ్ నూనెను ఎంచుకోండి
వెజిటబుల్ ఆయిల్‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్‌లో ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, పాల్‌మిటిక్ యాసిడ్ వంటి మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ను చాలా తక్కువగా ప్రాసెస్ చేస్తారు. ఇవి మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు సహాయపడతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
పండ్లు
మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎన్నో పండ్లు సహాయపడతాయి. ముఖ్యంగా కరిగే ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లను తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు ఇట్టే కరిగిపోతాయి. యాపిల్, ద్రాక్ష, సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీల్లో కరిగే ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.
సుగంధ ద్రవ్యాలు
అల్లం, వెల్లుల్లి, పసుపు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అధిక రక్త కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మెంతి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.