Fenugreek: బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే మెంతులను ఇలా ఉపయోగించండి..
Fenugreek: ప్రస్తుత కాలంలో ఓవర్ వెయిట్ ఓ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మెంతులు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో మెంతులు ఎంతో సహాయపడతాయి.

Health Benefits of Fenugreek: ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఆహార మార్పుల మూలంగానే ఊహించని విధంగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఇక బరువు పెరిగాక తగ్గేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
గంటలకు గంటలు జిమ్ లల్లో వ్యాయామాలు చేయడం, ఎంతో కష్టతరంగా ఉండే డైట్ ను ఫాలో అవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. వీటి వల్ల కొంత మంది బరువు తగ్గినా.. మరి కొందరు మాత్రం అలాగే ఉంటారు . అ సమస్యకు చెక్ పెట్టడంలో కొన్ని వంటింటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అందులో మెంతులు కూడా ఉన్నాయి. ఈ మెంతులను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
ఈ మెంతి గింజల్లో విటమిన్ ఎ, డి, ఫైబర్, ఐరన్ మెండుగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు మెంతి గింజలను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతుంది. ముఖ్యంగా ఇది శరీరంలో పేరుకు పోయిన కొవ్వులను కరిగిస్తుంది. ఇది డయాబెటీస్ రోగుల్లో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుగాయి.
అధిక బరువుతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం పూట పరిగడుపున మెంతి నీళ్లను తాగాలి. ఇందుకోసం పడుకునే ముందు మీరు ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో కొన్ని మొంతులను వేయాలి. ఆ నీళ్లను ఉదయాన్నే పరిగడుపున తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే మెంతులను నీటిలో మరగబెట్టి తాగినా శరీరంలో పేరుకున్న కొవ్వులన్నీ కరిగిపోతాయి.
మలబద్దకం సమస్య ఉన్న వారకి మెంతులు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మలబద్దకం సమస్య మటుమాయమవుతుంది. ఎవరైతే కేలరీలు తక్కువగా ఉండే టీని తాగడానికి ఇష్టపడతారో.. అలాంటి వారికి ఈ మెంతి టీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మెంటీ టీలో బెల్లీ ఫ్యాట్ ను తగ్గిచే గుణాలు మెండుగా ఉంటాయి. ఇందుకోసం కొన్ని నీళ్లు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ మెంతులు, కొద్దిగా అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా చేసుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ తొందరగా కరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మెంతుల్లో కాస్త తేనె కలుపుకొని తాగితే కూడా బరువు తగ్గుతారు. తేనె ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కాబట్టి మెంతులను నీళ్లలో మరిగించిన తర్వాత అందులో తేనె, కాస్త నిమ్మరసం కలుపుకుని హెర్బల్ టీ రూపంలో తాగొచ్చు.