అసలు మడమలు ఎందుకు పగులుతాయి.. వీటిని అందంగా చేయడానికి ఏం చేయాలంటే..?
మడమలు పగలడం వల్ల పాదాలు అందంగా కనిపించవు. అంతేకాకుండా నడిచినప్పుడు విపరీతంగా నొప్పి కూడా పెడుతుంది. అలాగే ఒక్కోసారి పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంది. మడమలు పగలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పగిలిన మడమలను తిరిగి అందంగా మార్చొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది పగిలిన మడమలతో ఇబ్బంది పడుతుంటారు. ఇది సర్వసాధారణమైన సమస్య. కానీ పగిలిన మడమల వల్ల అసౌకర్యంగా ఫీలవుతారు. వీటివల్ల కొంతమందికి నడవటానికి కూడా ఇబ్బంది పడతారు. పగుళ్లు మరీ ఎక్కువగా ఉంటే వాటిలోంచి రక్తం కూడా కారుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో వీటిని సులభంగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మడమల పగుళ్లకు కారణాలు?
అసలు మడమలు ఎందుకు పగుళుతున్నాయో తెలుసుకుంటే వీటిని నయం చేసుకోవడం చాలా సులువు. మడమల పగుళ్లకు అత్యంత సాధారణ కారణాలలో డ్రై స్కిన్ ఒకటి. అవును తేమ లేకపోవడం లేదా కఠినమైన సబ్బులను, డిటర్జెంట్లకు గురికావడం వల్ల మడమలు పగులుతాయి. అలాగే శరీరంలో తగినంత నీరు లేకపోవడం, ఎప్పుడూ షూస్ ను వేసుకోవడం, లేదా చెప్పులు వేసుకోవడం, ఎక్కువసేపు నిలబడటం, మీ పాదాల నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించకపోవడం వంటివి మడమల పగుళ్లకు కారణమవుతాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సోరియాసిస్, థైరాయిడ్ లేదా మూత్రపిండాల వ్యాధులు, డయాబెటిస్, పోషక లోపాల వల్ల కూడా మడమలు పగులుతాయి.
Cracked Heels
మడమల పగుళ్లను తగ్గించే చిట్కాలు
అసలు మీ మడమలు దేనివల్ల పగులుతున్నాయో తెలుసుకుంటే పగుళ్లు రాకుండా చూసుకోవడం చాలా సులువు. అంటే మీరు మీ పాదాలను శుభ్రంగా ఉంచాలి. అలాగే మంచి నాణ్యతున్న ఫుట్ లోషన్ లేదా క్రీమ్ లను అప్లై చేసి పాదాలను తేమగా ఉంచాలి. పాదాలను కడిగి ఆరబెట్టిన తర్వాత లోషన్ లేదా క్రీమ్ అప్లై చేయడం మంచిది. మీ శరీరంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉండటానికి మీ పాదాలను తుడవడానికి వేరే టవల్ ను ఉపయోగించాలి. పాదాలను కఠినమైన సబ్బులు, డిటర్జెంట్లు అంటుకోకుండా చూడాలి. ఎందుకంటే ఇవి మీ చర్మం నుంచి సహజ రక్షణ నూనెలను తొలగిస్తాయి.
పగుళ్లు రాకుండా ఉండటానికి ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ స్క్రబ్బర్ తో మీ పాదాల నుంచి చనిపోయిన చర్మ కణాలను క్రమం తప్పకుండా తొలగించాలి. మీ పాదాలకు గాలి తగిలే విధంగా ఉండే ఓపెన్-కాలి చెప్పులు లేదా షూస్ ను వేసుకోవాలి. ఇవి మీ పాదాలు పొడిగా ఉంచడానికి, చెమట పేరుకుపోవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మీరు హైడ్రేటెడ్ గా ఉండటానికి నీటిని పుష్కలంగా తాగాలి.
పగిలిన మడమలను తగ్గించే హోం రెమెడీస్
1. మడమల పగుళ్లు నయం అయ్యే వరకు .. మీ పాదాలను గోరువెచ్చని నీరు, బేకింగ్ సోడా మిశ్రమంలో రోజుకు 15-20 నిమిషాలు నానబెట్టండి. అదనపు ప్రయోజనాల కోసం ఈ వాటర్ లో పిప్పరమింట్ లేదా లావెండర్ వంటి కొన్ని చుక్కల నూనెను కూడా వేయొచ్చు.
2. పై చిట్కాతో పాటుగా పగుళ్లపై తేనెను అప్లై చేయడం వల్ల కూడా పగుళ్లు తగ్గిపోతాయి. తేనె మడమలను తేమగా ఉంచుతుంది. అలాగే పగుళ్లు తొందరగా తగ్గేందుకు సహాయపడుతుంది.
3. వాసెలిన్, నిమ్మరసం మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల కూడా మడమల పగుళ్లు తొందరగా నయమవుతాయి.
4. పగిలిన మడమల వల్ల నొప్పిగా ఉంటుంది. అయితే సరైన సంరక్షణ, నివారణ చిట్కాలతో వీటిని తగ్గించుకోవచ్చు. అయితే ఇవి మళ్లీ రాకూడదంటే మీ చర్మాన్ని తేమగా ఉంచాలి. అలాగే క్రమం తప్పకుండా ఎక్స్ఫోలియేట్ చేయాలి. సాధ్యమైనప్పుడు ఓపెన్-కాలి బూట్లు ధరించాలి.నీటిని పుష్కలంగా తాగాలి.