Beauty Tips: ఇలా చేస్తే మీ ముఖం సన్నగా అందంగా ఉంటుందని మీకు తెలుసా?
Beauty Tips: ముఖంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వలన మొఖం వెడల్పుగా మారిపోయి చిన్న వయసు అయినప్పటికీ వయసు మించిపోయినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఎక్సర్సైజులు చేయడం ద్వారా మొహాన్ని నాజుగ్గా చేసుకోవచ్చంట.. ఎలాగో చూద్దాం.

ముఖంలో కొవ్వు పేరుకుపోవడం వలన ముఖం చాలా లావుగా కనిపిస్తుంది. మిగతా శరీరం సన్నగా ఉన్న ముఖం లావుగా ఉండటం వలన ఉన్న వయసు కన్నా పెద్దవారిలా కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మొహం లోని కొవ్వుని కరిగించటానికి కొన్ని వ్యాయామాలు చేయాలి.
అయితే వీటి కోసం మీరు చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది ఎందుకంటే మిగతా శరీర భాగాలతో పోలిస్తే ముఖంలో ఉండే కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ ఎక్సర్సైజులు చేసుకోండి.
మొదటగా ఫేస్ ఎక్ససైజ్ ఎలా చేయాలంటే మీ బుగ్గలని ఉబ్బినట్లుగా ఉంచి గాలి బయటికి వదలడం లోపలికి పేల్చడం చేస్తూ ఉండాలి. అలాగే చూయింగ్ గమ్మని తినడం వల్ల ముఖానికి బెస్ట్ ఎక్ససైజ్ అవుతుంది దీనివల్ల ముఖంపై ఉండే కొవ్వు కరిగి ముఖం సన్నగా అందంగా మారుతుంది.
అలాగే విటమిన్ ఈ ఆయిల్ కూడా ముఖంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన క్యాప్సిల్స్ నుంచి నూనెని తీసి ముఖానికి మసాజ్ చేయాలి బొద్దుగా ఉన్న ప్రదేశంలో రుద్దుతూ ఉండటం వల్ల కొవ్వు తగ్గడంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది.
అలాగే తరచుగా బెలూన్లని ఊదడం వల్ల కూడా ముఖానికి ఎక్సర్సైజ్ జరిగి కొవ్వు కరిగి ముఖం సన్నగా అందంగా తయారవుతుంది. అలాగే గ్లిజరిన్ ఎప్సన్ ఉప్పు నూనె మిశ్రమాన్ని ముఖంపై మాస్క్ వేసుకోవాలి. 10 నిమిషాల పాటు దానిని ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖంలో కొవ్వు సులభంగా తొలగిపోతుంది. అలాగే వేడి నీటిలో టవల్ని ముంచి నీరు మొత్తం పోయేలాగా పిండి మొఖంపై పెట్టుకోవాలి ఇలా వారానికి ఒకసారి చేయడం వలన కూడా ముఖం సన్నగా అవుతుంది. అలాగే ముఖానికి మర్దన చేయడం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరిగే ముఖంలో కొవ్వు కరుగుతుంది. కాకపోతే వాటి కోసం ప్రత్యేకమైన నూనెలని ఉపయోగించాలి.