అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలా? అయితే వెదురు సారాన్ని తప్పకుండా ఉపయోగించండి..
వెదురు సారాన్ని ఎన్నో చర్మ సంరక్షణ ఉత్పత్తులల్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది అందాన్ని రెట్టింపు చేస్తుంది. చర్మ సమస్యలను తొలగిస్తుంది. అందుకే ఆడవారు వెదురు సారాన్ని బాగా ఇష్టపడతారు.

అందం విషయానికొస్తే ఆడవారు చాలా జాగ్రత్తగా ఉంటాయి. కొన్ని రకాల పదార్థాలు మిమ్మల్ని నిత్య యవ్వనంగా, మృదువైన, దృఢమైన చర్మాన్ని అందించడానికి సహాయపడతాయి. వీటిలో హోం రెమిడీస్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలోకి వెదురు సారం కూడా చేరింది. ఎందుకంటే ఇది చర్మానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకే దీన్ని ఎన్నో చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. అసలు వెదురు సారం అందానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
bamboo tree
చర్మానికి కాంతినిస్తుంది
ప్రతిఒక్కరూ నలుగురిలో తామే అందంగా కనిపించాలని కోరకుంటారు. అయితే వెదురు సారం అందాన్ని రెట్టింపు చేయడానికి బాగా సహాయపడుతుంది. దీనిలో సిలికా కంటెంట్ (70 శాతం) పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి కాంతినిస్తుంది. సిలికా గ్లైకోసమినోగ్లైకాన్స్ (జిఎజి) సంశ్లేషణకు మద్దతినిస్తుంది. అంతేకాదు చర్మంలోని తేమ బయటకు పోకుండా నివారించడానికి ఇది సహాయపడుతుంది.
skin care
యాంటీ బాక్టీరియల్
వెదురు సారంలో యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. ఇది మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. జిడ్డుగల చర్మం ఉన్న ఆడవారికి ఇది బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది జిడ్డు చర్మాన్ని పోగొడుతుంది. వెదురు సారం చర్మం బలంగా, దృఢంగా చేస్తుంది. ఇది మొటిమలకు గురయ్యే చర్మానికి అనువైంది. పర్యావరణం, బ్యాక్టీరియా, ట్యాక్సిన్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మొటిమల వల్ల చర్మం దెబ్బతినడాన్ని తగ్గిస్తుంది. చర్మం బయటి పొరను పునరుద్ధరించే సామర్థ్యాన్ని వెదురు కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
skin care
చర్మాన్ని శుభ్రపరుస్తుంది
వెదురు సారం అద్భుతమైన శుభ్రపరిచే, శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే ఇది చర్మం నుంచి కాలుష్య కారకాలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాబట్టి దుమ్ము, ధూళి, కాలుష్యానికి గురైన తర్వాత వెదురు సారం ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తిని ఉపయోగించండి.
skin care
అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ
సన్స్క్రీన్ అద్భుతాలు చేస్తుందని, హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించడానికి సహాయపడుతుందని మనందరికీ తెలుసు. వెదురు సారంతో ఉన్న సన్స్క్రీన్ లు మార్కెట్ లో చాలానే ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు వెదురు సారంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి యువి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. వెదురు సారం ముడతలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని సాపేక్షంగా మృదువుగా, తేమగా ఉంచుతుంది.
తక్కువ మొత్తంలో పొడి వెదురు సారాన్ని మీ మార్నింగ్ క్లీన్సర్ లో కూడా చేర్చొచ్చు. ఈ పౌడర్ దాదాపుగా ద్రవాలలో సులువుగా కరుగుతుంది. కాబట్టి మీకు ఇష్టమైన క్లీన్సర్ లో కలపండి. తర్వాత క్లెన్సర్ ను మీ చర్మానికి అప్లై చేసి 45 నుంచి 60 సెకన్ల పాటు మసాజ్ చేయండి. ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
వెదురు పొడిని హెయిర్ కండీషనర్ కు కూడా జోడించొచ్చు. దీనివల్ల మీ జుట్టు బలంగా, మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది. మూలం వద్ద మీ జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి.. మీరు మీ జుట్టు నూనెకు తక్కువ మొత్తంలో వెదురు సారాన్ని జోడించొచ్చు.