Cholesterol: చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఏవి తినాలి? ఏవి తినకూడదు?
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలను తింటే గుండె ఆరోగ్యానికి హానికరం.

cholesterol
కొలెస్ట్రాల్ జిగట (Sticky) పదార్థం. ఇది కణాల గోడలు (Cell walls), నాడీ వ్యవస్థ రక్షణ పొరలు (Nervous system protective layers), హార్మోన్లు (Hormones) ఏర్పడటానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను ప్రోటీన్ తో కలిపినట్లైతే .. అది లిపోప్రోటీన్ (Lipoprotein) లను ఉత్పత్తి చేస్తుంది.
High Cholesterol
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్.. రెండు చెడు కొలెస్ట్రాల్. వీటిని HDL మరియు LDL అని అంటారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్తప్రసరణ (Blood circulation)లో అడ్డంకి ఏర్పడుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు (High blood pressure), గుండె జబ్బులు (Heart disease) వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో LDL పెరగకుండా ఎలా ఆపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ (Green tea): గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) మరియు అనేక రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. గ్రీన్ టీని బరువు తగ్గించే పానీయంగా కూడా ఉపయోగిస్తారు. రోజూ గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
అవిసె గింజలు (Flax seeds): అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఈ విత్తనాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని (Bad cholesterol levels) తగ్గించడానికి సహాయపడతాయి. మీరు దీన్ని సలాడ్లు (Salads), ఓట్స్ (Oats) తో కలిపి తీసుకోవచ్చు.
చేపలు (Fish): చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. చేపలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.
కొలెస్ట్రాల్ పెరిగితే వీటిని తినకండి..
ఆయిలీ ఫుడ్స్ (Oily Foods): మన దేశంలో వండే చాలా రకాల ఆహారాలు ఆయిలీ ఫుడ్స్ యే. ముఖ్యంగా మార్కెట్ లో లభించే జంక్ ఫుడ్ (Junk food) కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణమవుతుంది.
పాల ఉత్పత్తులు (Dairy products): పాలను సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా పోషకాలను కలిగి ఉంటుంది. కానీ అధిక కొవ్వు ఉన్న పాలు మరియు జున్ను నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ ను విపరీతంగా పెంచుతాయి.
మాంసం (Meat): మాంసం తినడం ద్వారా శరీరానికి ప్రోటీన్ లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దీన్ని ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరగుతుంది. ఇది గుండెపోటుకు కారణమవుతుంది.