Health Tips: చర్మంపై దద్దుర్ల సమస్య వేదిస్తుందా.. అయితే ఇవి తీసుకుంటే అంతే సంగతి?
Health Tips: సాధారణంగా చర్మంపై దద్దుర్లు జన్యులు లేదా రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కారణంగా అభివృద్ధి చెందవచ్చు. అయితే దద్దుర్లు ఎందుకు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కొన్ని చర్మపు దద్దుర్లు జన్యువులు లేదా రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కారణంగా వస్తుంది కానీ కొన్ని రకాల దద్దుర్లు మనం తినే ఆహారం శరీరానికి పడినప్పుడు దానిని దద్దుర్ల రూపంలో బయటపెడుతుంది. సాధారణంగా దద్దుర్లు వచ్చినప్పుడు చర్మంపై గడ్డలు రావడం, చర్మం దురద పెట్టడం, చర్మం రంగు మారడం, స్కిన్ ఆల్సోరేషన్ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి.
అయితే ఈ దగ్గరలో దేని వలన వచ్చాయి అన్నది ముందు నిర్ధారించుకోండి. మనం వేసుకునే మెడిసిన్ కూడా ఒక్కొక్కసారి రియాక్షన్ ఇవ్వటం వలన చర్మంపై దురద దద్దుర్లు వస్తాయి. అటువంటి అప్పుడు డాక్టర్ ని సంప్రదించండి. ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలు తింటున్నప్పుడే అవి మన బాడీకి సరిపడవు అని సెంప్టెమ్స్ ఇస్తూ ఉంటాయి.
వాటిని మనం గుర్తించగలగాలి ఆ ఆహారాన్ని దూరం పెట్టాలి. అలాగే అలర్జీలతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల ఉత్పత్తులను తీసుకోకూడదు అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అలాగే నువ్వులను కూడా ఎక్కువగా తీసుకోకూడదు దీనివల్ల జీర్ణవ్యవస్థ చెదిరిపోయి పొట్ట ప్రాంతంలో కొవ్వు పెరుగుతుంది.
అలాగే ఎలర్జీతో బాధపడేవారు బెల్లాన్ని కూడా దగ్గరికి రానివ్వకండి ఎందుకంటే బెల్లం శరీరంలోని వేడిని పెంచుతుంది దీని కారణంగా ప్రభావిత ప్రాంతంలో దురద పెరుగుతుంది కాబట్టి వీలైనంత మటుకు బెల్లం వంటి తీపి పదార్థాలని దూరం పెట్టండి.
అలాగే పుల్లని పదార్థాలు అంటే నిమ్మరసం నారింజ రసం వంటి పుల్లని పదార్థాలను సైతం ఆహారంగా తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే పుల్లని పదార్థాలు శరీరంలో పైత్యరసం పెరగటానికి కారణమవుతాయి అలా జరిగితే రక్తంలో వ్యర్ధాలు పెరిగిపోతాయి.
అదేగాని జరిగితే దద్దుర్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. లేదు ఆ వస్తువులు మేము తినకుండా ఉండలేము అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి వారి సలహా పాటించండి.