Dental Health: దంతాలు తళతళ మెరవాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!
Dental Health: కొన్ని రకాల ఆహారాలు దంతాల ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా వీటివల్ల దంతాలు పచ్చగా మారుతాయి. అందుకే వాటిని దూరం పెట్టడమే మంచిది.

మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు దంతాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటివల్ల దంతాలు పసుపు పచ్చగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి దంతాలు పచ్చగా మారకూడదంటే ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం పదండి.
పొగాకు.. పొగాలకు ప్రాణాంతకం. దీనిని తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని టీవీ యాడ్ లల్లో మనం చూస్తూనే ఉంటాం. ఇకపోతే ఇది దంతాల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. పొగాకు వేసుకోవడం, సిగరేట్ ను కాల్చడం వంటి అలవాట్ల వల్ల దంతాలపై పసుపు పచ్చని మరకలు వస్తాయి. ఇవి అంత సులువుగా వదలవు. అందుకే దీనిని దూరంగా ఉండటమే మంచిది.
టీ.. టీ కూడా దంతాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీన్నిమోతాదుకు మించి తాగడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడతాయి. అంతేకాదు దంతాలు సహజ మెరుపును కూడా కోల్పోతాయి. అందుకే దీనికి బదులుగా గ్రీన్ టీని తాగడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
black coffee
బ్లాక్ కాఫీ.. టీ, కాఫీ కంటే.. బ్లాక్ కాఫీని తాగడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. ఈ బ్లాక్ కాఫీ వల్ల వెయిట్ కంట్రోల్ లో ఉండటమే కాదు.. షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు ఇది తాగితే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలా అని బ్లాక్ కాఫీని మోతాదుకు మించి తాగితే మాత్రం దంతాలపై మరకలు ఏర్పడే ప్రమాదం ఉంది.
Red wine
రెడ్ వైన్.. రెడ్ వైన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదికూడా మోతాదులో తీసుకుంటేనే. ఆరోగ్యానికి మంచి చేస్తుందని అదే పనిగా రెడ్ వైన్ తాగితే మాత్రం మీ దంతాలు సహజ మెరుపును కోల్పోయి.. పసుపు పచ్చగా మారుతాయి.
Soda
సోడా.. డైట్ సోడా, డార్క్ సోడా, కూల్ డ్రింక్స్ ను ఇష్టంగా తాగే వారి సంఖ్య బాగానే ఉంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాదు దంతాల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ముఖ్యంగా వీటిని విచ్చలవిడిగా తాగడం వల్ల పళ్లు పచ్చగా మారుతాయి.