ఇంట్లో ఉన్న బల్లి కరిస్తే ఏమౌతుందో తెలుసా?
బల్లులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అయితే ఇంట్లో ఉన్న బల్లులు విషపూరితం కావన్న మాటను వినే ఉంటారు. అసలు ఇంట్లో ఉన్న బల్లి కరిస్తే ఏమౌతుంది? కరిచిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతి ఒక్కరి ఇంట్లో ఈగలు, దోమలు ఉండటం ఎంత కామనో.. బల్లులు ఉండటం కూడా అంతే కామన్. కొంతమంది అయితే బల్లులను చూసి చాలా భయపడిపోతుంటారు. ఎందుకంటే బల్లులు విషపూరితమైనవని, ఇవి కరిస్తే ఏదైనా జరుగుతుందని ఇలా భయపడిపోతుంటారు. ఇంట్లో ఉండే బల్లులను ఇంటి పురుగులు అని కూడా అంటారు. అయితే ఈ బల్లుల చర్మం నుంచి విషం వస్తుందని చాలా మంది నమ్ముతారు. అసలు బల్లులు విషపూరితమైనవా? ఇవి కరిస్తే డేంజరా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంట్లో ఉన్న బల్లులు విషపూరితమైనవా?
నిజానికి ఇండ్లల్లో ఉండే బల్లులు విషపూరితమైనవి కావు. అలాగే వీటి చర్మంలో విషం కూడా ఉండదు. అయితే కొన్ని జాతుల బల్లులు మాత్రం విషపూరితమైనవి. కానీ ఇవి ఇండ్లలో ఉండవు. అడవుల్లోనే ఉంటాయి. మన ఇండ్లలో ఉండే బల్లులు కీటకాలను తింటాయి.
ఇవి మనుషులకు డేంజర్ కాదని నమ్ముతారు. కానీ ఇవి మనుకు అంటువ్యాధులు వచ్చేలా చేస్తాయి. ఎందుకంటే బల్లులు పరాన్నజీవులు,బ్యాక్టీరియాను తింటాయి. అందుకే వీటి మలం డేంజర్ అంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు బల్లి కరవొచ్చు. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
బల్లి కరిస్తే ఏం చేయాలి?
ఏ కారణం వల్లనైనా మిమ్మల్ని బల్లి కరిస్తే బయపడకుండా వెంటనే చికిత్స తీసుకోండి. ముందుగా బల్లి కరిచిన చోటును శుభ్రమైన నీళ్లతో కడగండి. దీన్ని యాంటీసెప్టిక్ సబ్బుతో కడగాలి. ఆ తర్వాత యాంటీసెప్టిక్ తో శుభ్రం చేయండి. తర్వాత అక్కడ యాంటీసెప్టిక్ క్రీమ్ ను రాయండి. దీనివల్ల సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. అయినా నొప్పి, వాపు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
బల్లి కాటు వల్ల కలిగే విషాన్ని ఎలా గుర్తించాలి?
బల్లి కరిచిన చోట విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలాగే అక్కడ చర్మం వాపు వస్తుంది. ఎర్రగా మారుతుంది. వేడిగా అవుతుంది. అలాగే బల్లి కరిచిన చర్మం చుట్టూ దురద పెడుతుంది. లేదా దద్దుర్లు ఏర్పడతాయి. ఇది సంక్రమణకు సంకేతం. దీనివల్ మీకు బాగా జ్వరం కూడా వస్తుంది. అలాగే వాంతులు, వికారం కూడా విషపూరితానికి సంకేతం.
బల్లులు ఇంట్లోకి రాకూడదంటే ఏం చేయాలి?
ఇంట్లోకి బల్లులు రాకుండా చేయడానికి ఎన్నో పద్దతులు ఉన్నాయి. ముఖ్యంగా మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంటే బల్లులు రానేరావు. అలాగే ఇంట్లో ఆహార పదార్థాలు, పానీయాలపై గిన్నెలు మూయాలి. గోడలు, పైకప్పుల్లో పగుళ్లను మూసేయాలి.అలాగే ఇంట్లోకి కీటకాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే బల్లులకు పురుగులే ఆహారం. కాబట్టి మీ ఇంట్లో పురుగులు ఉంటే బల్లులు ఖచ్చితంగా వస్తాయి.