పడుకునే ముందు వేడి పాలలో ఖర్జూరాలు వేసుకుని తాగితే ఏమౌతుందో తెలుసా?
పాలు, ఖర్జూరాలు రెండూ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు పాలలో ఖర్జూరాలను నానబెట్టి తింటే బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాలు, ఖర్జూరాలు రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ప్రతిరోజూ తీసుకుంటుంటారు. కాకపోతే ఈ రెండింటిని కలిపి తినే వారు చాలా తక్కువ మంది. కానీ పాలలో ఖర్జూరాలను వేసుకుని తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆ సీజన్ ఈ సీజన్ అని కాకుండా ప్రతిసీజన్ లో తినొచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఖర్జూరాలను పాలలో వేసుకుని తినడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాలు, ఖర్జూరాల్లోని పోషకాలు
పాలలో ప్రోటీన్లు, విటమిన్ బి12, కాల్షియంతో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలను తాగితే మన ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల సమస్యలు తగ్గిపోతాయి. అలాగే మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
ఇకపోతే ఖర్జూరాల్లో కూడా మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, నేచురల్ షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.
పాలలో ఖర్జూరాన్ని వేసుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఎముకలు బలంగా ఉంటాయి
పాలలో కాల్షియం, ఖర్జూరాల్లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కలిసి మన ఎముకల్ని బలంగా ఉంచడానికి, ఎముకల సమస్యలు రాకుండా ఉంచడానికి సహాయపడతాయి. ఈ కాంబినేషన్ ముఖ్యంగా పిల్లలకు, టీనేజర్లకు, వృద్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీన్ని తింటే అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి.
milk
ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది
ఖర్జూరాల్లో నేచురల్ షుగర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే మనకు వెంటనే ఎనర్జీ అందుతుంది. దీంతో అలసట, బలహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది
ఖర్జూరాల్లో, పాలలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అంటే ఖర్జూరాలు, పాల కాంబినేషన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది
పాలు, ఖర్జూరాల కాంబినేషన్ మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. ఎందుకంటే పాలు, ఖర్జూరాలు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడతాయి. ఇది మన శరీరాన్ని ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
బరువు పెరగడానికి సహాయపడుతుంది
బక్కగా ఉన్నామని బాధపడేవారికి, బరువు పెరగాలని ట్రై చేస్తున్న వారికి పాలు, ఖర్జూరాలు రెండూ సహాయపడతాయి. ఎందుకంటే ఈ రెండింటిలోనూ పోషకాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపడుకునే ముందు పాలలో ఖర్జూరాన్ని తింటే మీరు బరువు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే పాలలో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి, అవి పెరగడానికి సహాయపడతాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్ సి మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
milk combinations
ఖర్జూరాలను పాలలో ఎప్పుడు కలుపుకుని తాగొచ్చు?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఖర్జూరాలను ఎప్పుడైనా పాలలో నానబెట్టి తాగొచ్చు. కానీ నిద్రపోవడానికి ముందు తాగితే మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు రాత్రిపూట బాగానిద్రపోవడానికి సహాయపడుతుంది.
అయితే పాలు, ఖర్జూరాలు రెండూ ఆరోగ్యకరమైనవే కావు. కానీ కొంతమందికి వీటికి అలెర్జీ ఉండొచ్చు. అందుకే మీకు ఏదైనా అలెర్జీ గనుక ఉంటే పాలు, ఖర్జూరాలను తినే ముందు డాక్టర్ ను ఖచ్చితంగా సంప్రదించాలి. అలాగే డయాబెటీస్ పేషెంట్లు డాక్టర్ సలహా తీసుకోకుండా ఖర్జూరాలను తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే నేచురల్ షుగర్స్ బ్లడ్ షుగర్ ను పెంచే అవకాశం ఉంది.