ఈ రసం ఒక్కటి తాగితే చాలు కొలెస్ట్రాల్ వెన్నలా కరిగి.. మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది
కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇందుకోసం మీరు శరీరక శ్రమను పెంచాలి. అయితే కొన్ని రకాల ఆహారాలు కూడా కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఉపయోపడతాయి..
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచిది. రెండు చెడ్డది. మంచి కొలెస్ట్రాల్ వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది. శరీర భాగాల పనితీరు మెరుగుపడుతుంది. అదే చెడు కొలెస్ట్రాల్ వల్ల శరీర ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె పోటు, స్ట్రోక్, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. అయితే కలబంద రసం కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా కలబంద రసాన్ని ముఖం, చర్మం అందాన్ని పెంచడానికి, ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు. నిజమేంటంటే.. ఈ కలబంద రసం అందాన్ని పెంచడంతో పాటుగా ఎన్నో వ్యాధుల ప్రమాదాల్ని కూడా తగ్గిస్తుందని తక్కువ మందికే తెలుసు.
ఆయుర్వేదం ప్రకారం.. కలబంద రసం దివ్య ఔషదంతో సమానం. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలుంటాయి. రోజు ఒక గ్లాస్ కలబంద రసం తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అయితే దీన్ని ఇంట్లోనే తయారుచేసుకోవడం ఉత్తమం.
కలబంద రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
కలబంద రసం రోజూ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది. దీనిని తాగడం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మన దేశంలో చాలా మంది ఆయిలీ ఫుడ్ నే తింటుంటారు. ఇవి టేస్టీగా ఉన్నప్పటికీ వీటిని తినడం వ్లల కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంతేకాదు మలబద్దకం, అజీర్థి, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యల వల్ల సరిగ్గా ఏం తినలేరు.. తాగలేరు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కలబంద జ్యూస్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద జ్యూస్ తాగితే మెటబాలిజం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Image: Getty Images
చర్మానికి మేలు
మన చర్మానికి కలబంద జ్యూస్ గొప్ప ఆయుర్వేద ఔషదంలా పనిచేస్తుంది. అందుకే దీన్ని చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లల్లో ఉపయోగిస్తుంటారు. చర్మం అందంగా, ఆరోగ్యంగా మారేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద జ్యూస్ ను తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గ్లో అవుతుంది కూడా.