ఈ ఆరు రోజులు భార్యభర్తలు శారీరకంగా అస్సలు కలవొద్దు.. ఏం జరుగుతుందో తెలుసా?
హిందూ శాస్త్రంలో ప్రతీ విషయం గురించి ప్రస్తావించినట్లే భార్యభర్తల శారీరక బంధం గురించి కూడా కొన్ని విషయాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం ఆలుమగలు కొన్ని రోజుల్లో శారీరకంగా అస్సలు కలవకూడదని చెబుతుంటారు. దీనివల్ల పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసిస్తుంటారు. ఇంతకీ ఆ రోజులు ఏంటంటే..
అమావాస్య, పౌర్ణమి రోజుల్లో దూరంగా
ఏ నెలలో అయినా అమావాస్య, పౌర్ణమి నాడు దంపతులు శారీరకంగా కలవకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంపై చెడు ప్రభావం పడుతుంది, కుటుంబంలో సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
చవితి, అష్టమి తిథులలో
ఏ నెలలో అయినా చవితి, అష్టమి తిథులలో దంపతులు శారీరక సంబంధం పెట్టుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ తిథుల్లో శారీరకంగా కలిస్తే పుట్టబోయే పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
పితృపక్షంలో
పితృపక్షంలో మనసు, శరీరం, మాట, చేతలు అన్నీ పవిత్రంగా ఉండాలి. పితృపక్షంలో దంపతులు శారీరక సంబంధాల గురించి ఆలోచించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో శారీరక సంబంధం పెట్టుకుంటే పితృ దేవతలు కోపగిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
నవరాత్రుల్లో
నవరాత్రులు చాలా పవిత్రమైనవి. ఇళ్లలో కళశ స్థాపన చేస్తారు. నవరాత్రుల్లో స్త్రీ, పురుషుల మధ్య శారీరక సంబంధం పెట్టుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉపవాసంలో
ఏ రోజున అయినా ఉపవాసం ఉన్నవారు ఆ రోజు పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన మనసుతో చేసే పూజ ఫలిస్తుంది. ఉపవాసం ఉన్నవారు ఆ రోజు పూర్తి బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.