చిన్న చిన్న విషయాలకే ఏడుస్తుంటారా? ఏడుపు కంట్రోల్ కావాలంటే ఇలా చేయండి
ఏదేమైనా చిన్న చిన్న విషయాలకే ఏడిస్తే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మీ ఏడుపును కూడా కేర్ చేయరు. ఈ ఏడుపు మిమ్మల్ని ఇతరుల ముందు తక్కువ చేస్తుంది. అందుకే చిన్న చిన్న వాటికి కూడా ఏడుపు మంచిది కాదు. మరి ఈ ఏడుపు కంట్రోల్ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంతో బాధొస్తే తప్పా.. ఏడవని వారు చాలా మందే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఏమోషనల్ సీన్ చూసినా.. బాధాకరమైన సినిమాలు చూసినా.. పాటలు విన్నా ఊరికే ఏడుస్తుంటారు. ముఖ్యంగా అవతలి వ్యక్తి ఏమాత్రం చెడుగా మాట్లాడినా, తిట్టినా కంట్లోనుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. ఇంకొంతమంది అవతలి వ్యక్తిని తిడుతూనే ఏడుస్తుంటారు. కానీ ఇలా చీటికి మాటికి ఏడుపు అస్సలు మంచిది కాదు. ఇది మీ కన్నీళ్లకు విలువ లేకుండా చేస్తుంది. మిమ్మల్ని ఎవరూ లెక్క చేయకుండా చేస్తుంది. ఇతరుల చెడు ప్రవర్తన, బాధాకరమైన మాటల వల్ల కూడా ఏడుస్తాం. కొన్నిసార్లు ఏడుపు మనసును తేలికగా, ప్రశాంతంగా ఉంచుతుంది. నిజానికి ఏడుపు మీకు మంచి అనుభూతిని కలిగించడానికి సహాయపడుతుంది. కానీ అయిన దానికి కాని దానికి ఏడిస్తే మాత్రం మీ కన్నీళ్లకు విలువ అసలే ఉండదు. అందుకే ఏడుపును కంట్రోల్ చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Crying is good- why don't you just cry- Five Tips for Crying
ఏడుపు ఎందుకొస్తుంది
కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టిముట్టినప్పుడు లేదా కొంతమందితో మాట్లాడినప్పుడు మీకు నిస్సాయంగా అనిపించొచ్చు. ఎదుటివారి ముఖాల్లో కనిపించే చీదరింపు, మీరు వినకూడదని మాటలు విన్నప్పుడు ఎంతో ఒత్తిడికి లోనవుతారు. ఇది మీ మనస్సుపై కూడా ప్రభావం చూపుతుంది. మీ ఒత్తిడిని నియంత్రించడం నేర్చుకుంటే మీ కన్నీళ్లను బాగా నియంత్రించొచ్చు.
పదే పదే ఏడవడం మీ బలహీనతను రుజువు చేస్తుంది
మీరు ఎక్కువగా ఏడిస్తే ఇతరుల ముందు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే. ఇది ఇలా ఎప్పుడూ ఏడవడం వారికి మీ బలహీనంగా అనిపించొచ్చు. మీరు ఇలా ఎక్కువ సేపు ఏడిస్తే మీరు ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థం. మరి ఏడుపును ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ తలను కొద్దిగా పైకి లేపండి
కన్నీళ్లు కంట్లోంచి కిందికి జారకుండా ఉండటానికి మీ తలను కొద్దిగా పైకి లేపండి. దీనివల్ల మీ కనురెప్పల కిందే కన్నీళ్లు పేరుకుపోతాయి. దీంతో మీ ముఖంపైకి కన్నీళ్లు జారవు. ఈ ప్రక్రియ కన్నీటి ప్రవాహాన్ని ఆపగలదు. అలాగే ఇది మీ దృష్టిని కూడా వేరే విషయాలపై మళ్లిస్తుంది.
కండరాలను సాగదీయండి
కండరాలను సాగదీయడం వల్ల ఏడుపు నుంచి ఉపశమనం లభిస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇది మీ శరీరం, మెదడు రెండింటినీ నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీకు ఏడుపు వచ్చినట్టుగా అనిపిస్తే మీ ముఖాన్ని స్థిరంగా ఉంచండి. ఇది వారి మాటల ప్రవాహాన్ని ఆపుతుంది. మీకు కన్నీళ్లు తెప్పించే విషయాలు చెప్పే అవకాశం కూడా తగ్గుతుంది. నిర్దిష్ట భావోద్వేగాలను ప్రదర్శించే ముఖ కవళికల కంటే ముఖం తటస్థంగా ఉన్నప్పుడు మానసిక కార్యకలాపాలు తక్కువగా ప్రేరేపించబడతాయి.
మీ శ్వాసను నియంత్రించండి
మీకు ఏడుపు వచ్చినట్టుగా ఉన్నట్టు అనిపిస్తే మీ శ్వాసను నియంత్రించండి. ముఖ్యంగా ఈ సమయంలో లోతైన శ్వాస తీసుకోవడానికి, నెమ్మదిగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని మరింత ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇది మీ ఏడుపును ఆపుతుంది.
ఫాస్ట్ గా బ్లింక్ చేయండి
మీరు ఏడుస్తున్నప్పుడు మీ కనురెప్పలను ఫాస్ట్ ఫాస్ట్ గా బ్లింక్ చేయండి. ఇది మీ కన్నీళ్లను ఆపుతుంది. దీంతో కన్నీళ్లు మీ ముఖంపైకి రావు. అయితే మీరు ఇప్పుడు ఇక ఏడుస్తారు అన్నప్పుడు మీ కనురెప్పలను కూడా కనురెప్పలను ఫాస్ట్ గా బ్లింక్ చేయండి. ఇది కన్నీళ్లు రాకుండా ఆపుతుంది.