Lip care: అందమైన పెదవుల కోసం ఐదు సూత్రాలు.. ఈ కాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి?
Lip care: వర్షాకాలం ప్రారంభంలో అనారోగ్య సమస్యలతో పాటు చర్మంకు సంబంధించిన ఎలర్జీలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా లేత చర్మాలు వాతావరణం మార్పులతో పొడిబారుతూ ఉంటాయి. అందులో పెదవుల సమస్య. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందటానికి వీటిని పాటించాలి.

పెదవులు మన ముఖంలో అత్యంత మృదువైన భాగం. ఇవి సున్నితంగా ఉంటాయి. తేమను ఉత్పత్తి చేయటానికి గ్రంధులను కలిగి లేనందున సులభంగా పొడిబారి పోతూ ఉంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ అందమైన పెదవులని కూడా మరింత అందంగా మార్చుకోవచ్చు.
అవేంటో చూద్దాం.. కొంతమంది సున్నితపు పెదాలు కలిగిన వాళ్లకు పైనున్న చర్మం కూడా ఊడి వస్తుంది. కాబట్టి పెదవులకి ఫస్ట్ ఎయిడ్ లాగా ఫస్ట్ చేయవలసిన పని లిప్ బామ్ ని అప్లై చేయడం. మీరు నిద్రపోతున్నప్పుడు అప్లై చేయడం వలన పెదాల పగుళ్ళకి ఇది ఒక మాస్క్ లాగా పని చేస్తుంది.
ఇక రెండవ సూత్రం ఏమిటంటే వర్షాకాలంలో వచ్చే చలి వల్ల పెదాలు తేమగా అవుతాయని చాలామంది పెదాలను చప్పరిస్తూ ఉంటారు అయితే దానివల్ల పెదాలు మరింత పొడిబారతాయి. ఎందుకంటే లాలాజలంలోని ఎంజైములు ఆహారం జీర్ణం చేయడంలో సహాయపడతాయి కానీ పెదవులను చికాకు పెట్టవచ్చు.
ఇక మూడవ సూత్రం స్క్రబ్బింగ్ మీరు మీ పెదవుల కోసం లిప్ స్క్రబ్ లను ఉపయోగించాలి. స్క్రబ్బింగ్ చేయడం వలన చర్మం లోని మృత కణాలు తొలగిపోతాయి. స్క్రబ్బింగ్ కోసం తేనేని బ్రౌన్ షుగర్ ని కలిపి స్క్రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక నాలుగవ సూత్రం ఎక్స్ ఫోలియేట్ చేయటం.
సున్నితమైన ఎక్స్పోల్యేషన్ చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది ఇది మీ పెదాలకు సహజ మృదుత్వాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇక ఆఖరిది ఐదవది అయిన సూత్రం హైడ్రేటెడ్ గా ఉండడం చాలా మీరు తాగడం ద్వారా మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
వర్ష కాలం లో ఎక్కువ చెమట పట్టదు కాబట్టి మనం చాలా తక్కువ నీరు తాగుతాం కాబట్టి చర్మం మరియు పెదవులు నిస్తేజంగా కనిపిస్తాయి. కాబట్టి తగినంత నీరు తీసుకోవడం ద్వారా మీ శరీరంతో పాటు పెదవులు కూడా డిహైడ్రేట్ అవకుండా ఉంటాయి.