బరువు తగ్గడం నుంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడం వరకు.. కాఫీని తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!
టీతో పోల్చితే కాఫీనే టేస్టీగా ఉంటుంది. అంతేకాదండోయ్ కాఫీని తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అలాగే కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఇంకా డయాబెటీస్ ప్రమాదం ముప్పు తప్పడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదం కూడా తప్పుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో కాఫీ ఒకటి. టీ కంటే కాఫీనే ఎక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే టీతో పోల్చితే కాఫీనే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది కాఫీతోనే రోజును ప్రారంభిస్తారు. ఆఫీసుల్లో పనిచేసేవారు, ఇతర పనులకు వెళ్లే వారు రోజుకు ఐదారు సార్లైనా కాఫీని తాగుంటారు. కాఫీని తాగడం వల్ల శరీరం ఉత్సాహంగా మారుతుంది. శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అయితే కొంతమంది పాలతో వేడి వేడి కప్పు కాఫీని ఇష్టపడతారు. మరికొంతమంది కోల్డ్ కాఫీ లేదా బ్లాక్ కాఫీని ఇష్టపడతారు. ఏదేమైన రోజూ కాఫీని తాగడం వల్ల మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలాగే శరీర శక్తి స్థాయిలను మెరుగుపర్చడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని అధ్యయనాలు నిరూపించాయి. మరీ కాఫీని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
కాఫీ బరువును తగ్గించగలదా?
కాఫీని తాగడం వల్ల శరీర కొవ్వు, బిఎమ్ఐ, బరువు తగ్గుతారని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఎందుకంటే కాఫీలోని కెఫిన్ జీవక్రియ రేటును బాగా పెంచుతుంది. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు బాగా తగ్గుతుంది.
black coffee
రోజుకు ఎంత కాఫీ సురక్షితం?
పలు నివేదికల ప్రకారం.. రోజుకు 400 మిల్లీగ్రాములు అంటే సుమారు నాలుగు లేదా ఐదు కప్పుల కాఫీ ఆరోగ్యకరమైన వ్యక్తులకు సురక్షితమైనది. అయితే మిల్క్ కాఫీ కంటే బ్లాక్ కాఫీనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో అదనపు నీరు తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను చూపించదు. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది కూడా.
black coffee
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఏదైనా అతిగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాఫీ కూడా అంతే.. అయితే కాఫీని మోతాదులో తాగితే మాత్రం మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. క్రమం తప్పకుండా కాఫీని తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఎక్కువ కాలం బతుకుతారని పరిశోధకులు కనుగొన్నారు.
బరువును తగ్గిస్తుంది
కొన్ని అధ్యయనాల ప్రకారం.. కాఫీని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండూ మీరు వేగంగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
మంటను తగ్గిస్తుంది
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంట నుంచి ఉపశమనం కలిస్తాయి. నిజానికి మంట అనేక అనారోగ్యాలకు మూల కారణం. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. అలాగే వీటిని హానిచేయని రసాయనాలుగా మారుస్తాయి కూడా. చివరికి ఇవి మన శరీరంలోంచి బయటకు పంపుతాయి. రోస్టెడ్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తలో ఉంటాయి.
తక్కువ డయాబెటిస్ ప్రమాదం
రోజుకు కేవలం కప్పు కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. కాఫీలో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఉంటాయి. ఈ రోజుల్లో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ డయాబెటీస్ ప్రమాదం తగ్గాలంటే తక్కువ షుగర్ తో బ్లాక్ కాఫీని తాగితే మంచిది.
అథ్లెట్ పనితీరును మెరుగుపరుస్తుంది
భారీ వ్యాయామం చేసిన తర్వాత కండరాల నొప్పి, ఒంటి నొప్పులు కలుగుతాయి. అయితే ఈ నొప్పులు తగ్గడానికి కాఫీ ఎంతో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇది నొప్పి నివారణగా పనిచేస్తుంది. అంతేకాదు కష్టపడి, వేగంగా, ఎక్కువ కాలం పనిచేసే సామర్థ్యంతో సహా అథ్లెట్ పనితీరును పెంచడానికి కాఫీ ఎంతగానో సహాయపడుతుంది.