పిల్లల ఎముకలు బలంగా అవ్వాలంటే ఇలా చేయండి..
పెద్దవారితో పోల్చితే పిల్లల ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. దీనివల్ల వారికి చిన్న చిన్న దెబ్బలు తాకినా ప్రమాదకరంగా మారుతుంది. అందుకే వారి ఎముకలను బలంగా చేసే చిట్కాలను తప్పక పాటించాలి.
పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారి ఎముకల ఆరోగ్య విషయంలో. ఎందుకంటే పిల్లల ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. పిల్లల ఎముకలకు చిన్న దెబ్బతగిలినా.. అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తుల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాల్యంలో బలమైన ఎముకలు వారి జీవితకాల ఆరోగ్యానికి అద్భుతమైన పునాదిని అందిస్తాయి. అందుకే పిల్లల ఎముకల బలం పెరగడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
calcium
కాల్షియం
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరమన్న సంగతి అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా అన్ని పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లల ఎముకల అభివృద్ధికి.. తల్లిదండ్రులు.. పిల్లలు రోజుకు కనీసం 2 గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే మీ పిల్లల ఆహారంలో బచ్చలికూర, కాలే, ఓక్రా వంటి ఆకుపచ్చ కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడండి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
vitamin d
విటమిన్ డి
కాల్షియం శోషణ విటమిన్ డి సహాయపడుతుంది. దీనిని కొన్నిసార్లు విటమిన్ డి 3 అని కూడా పిలుస్తారు. మన దేశంలో విటమిన్ డికి ఎలాంటి కొదవ లేకున్నా.. చాలా మంది మాత్రం ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందొచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్ ను తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నవజాత శిశువులకు కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం. కానీ డాక్టర్లను సంప్రదించిన తర్వాతే ఇవ్వాలి.
magnesium
మెగ్నీషియం, విటమిన్ కె
శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా మీ పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బచ్చలికూర, కాలే, క్యాబేజీ, ఆకుపచ్చ మొలకలు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో విటమిన్ కె, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు తృణధాన్యాలను పెట్టండి.
కార్బోనేటేడ్ పానీయాలను నివారించండి
కార్బోనేటేడ్ పానీయాలు పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ పానీయాలను తాగించండి.
శారీరక శ్రమ ఎముకలను బలోపేతం చేస్తుంది. అందుకే మీ పిల్లలు బాగా ఆటలు ఆడేలా చూడండి. వీలైతే చిన్న చిన్న వ్యాయామాలను చేయించండి. కండరాల మాదిరిగానే మీ పిల్లలు ఎముకలను ఎక్కువగా ఉపయోగించినప్పుడు అవి బలంగా మారుతాయి. మీ కండరాలతో మీ ఎముకలకు ఒత్తిడి చేసినప్పుడు ఎముకలు బలంగా మారుతాయి. పెద్దల కంటే పిల్లలలో శారీరక వ్యాయామానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పిల్లలు ఎక్కువ బరువు మోసే కార్యకలాపాలలో పాల్గొంటే వారి ఎముకలు బలంగా మారతాయి. అందుకే పిల్లలు రన్నింగ్, వాకింగ్, దూకడం, ఎక్కడం వంటి కార్యకలాపాలను చేయించండి. మీ పిల్లలు ఫోన్ ను ఎక్కువ సేపు చూడకుండా జాగ్రత్త పడండి. ఇవి మీ పిల్లల మానసిక, శారీరక సమస్యలను కలిగిస్తాయి.