దాల్చిన చెక్క ఆరోగ్యానికే కాదు అందానికి కూడా.. ఇది మన చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?
మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. దీన్ని ఎన్నో వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. తీయగా ఉండే ఈ మసాలా దినుసు వంటలనే టేస్టీగా చేస్తుంది. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అంతేకాదు ఇది చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది తెలుసా?
దాల్చిన చెక్క టేస్ట్ అదిరిపోతుంది. తీయగా ఉండే ఈ మసాలా దినుసులు వంటలనే బలే టేస్టీగా చేస్తుంది. అందుకే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడం నుంచి నోటి దుర్వాసనను పోగొట్టడం వరకు మన ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఇది మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. అవును దాల్చిన చెక్కను ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. దాల్చిన చెక్కలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని రక్షిస్తాయి. ఇది మన చర్మానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రమణ
దాల్చిన చెక్కలో ఎన్నో రకాల ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. అంతేకాదు దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై వివిధ రకాల ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడతాయి.
చర్మానికి ఆక్సిజన్ సరఫరా
దాల్చిన చెక్కలో యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలు, మొటిమల మచ్చలు, బ్లాక్ హెడ్స్ సమస్యలను ఇట్టే తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను వాడటం వల్ల మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. దీని వల్ల చర్మానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది.
కొల్లాజెన్ ఉత్పత్తి
దాల్చిన చెక్కను చర్మానికి రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల వృద్ధాప్యంలో ముఖంపై మచ్చలు రావడం, ముడతలు వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలంటే?
దాల్చిన చెక్క నూనెతో మసాజ్
పొడి చర్మంతో ఇబ్బంది పడేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇలాంటి వారికి దాల్చిన చెక్క నూనె ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మంలో రక్త ప్రసరణను పెంచి చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. దాల్చిన చెక్క నూనెను ఉపయోగించే ముందు దీనిలో కొద్దిగా పెట్రోలియం జెల్లీ లేదా ఆలివ్ ఆయిల్ ను వేసి చేతులతో చర్మాన్ని మసాజ్ చేయండి.
skin care
దాల్చిన చెక్క స్క్రబ్
దాల్చిన చెక్క నేచురల్ ఎక్స్ఫోలియేటర్ గా కూడా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల పెరుగులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలపండి. దీనిని మీ చర్మానికి పెట్టండి. ఆ తర్వాత చేతులతో వృత్తాకార కదలికలో చర్మాన్ని స్క్రబ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
దాల్చిన చెక్క, అరటిపండు ఫేస్ మాస్క్
దాల్చినచెక్క మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇక అరటిపండ్లలో ఉండే పోషకాలు చర్మానికి తగినంత తేమను అందిస్తాయి. ఇందుకోసం సగం అరటిపండు తీసుకుని బాగా మెత్తగా రుబ్బి, అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, తేనె వేసి కలపండి. ఇప్పుడు దీన్ని చర్మానికి అప్లై చేసి 2 నిమిషాల పాటు మసాజ్ చేయండి.