MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • రేపటి నుండే మే నెల పెళ్లి ముహూర్తాలు స్టార్ట్ ... ఒక్కటవ్వనున్న 50 వేల జంటలు, పూర్తి ముహూర్తాల లిస్ట్..!

రేపటి నుండే మే నెల పెళ్లి ముహూర్తాలు స్టార్ట్ ... ఒక్కటవ్వనున్న 50 వేల జంటలు, పూర్తి ముహూర్తాల లిస్ట్..!

పెళ్లి చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు వచ్చేసాయి. దీంతతో సుమారుగా 50 వేల జంటలు పెళ్లపీఠలెక్కున్నాయి.   

2 Min read
Mahesh Rajamoni
Published : May 03 2022, 11:52 AM IST | Updated : May 03 2022, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవబోతోంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో సుముహూర్తాలు వచ్చేసాయి కాబట్టి. ఈ సుముహూర్తాల్లో సుమారుగా 50 వేల జంటలు పెళ్లిపీఠలెక్కనున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పెళ్లిళ్లకు అనువైందనే చెప్పాలి. కానీ ఎండలే దారుణంగా దంచికొడుతున్నాయి. 

28
groom commits suicide after bride refuse to marry in farrukhabad

groom commits suicide after bride refuse to marry in farrukhabad

కరోనా ఎఫెక్ట్ తో సుమారుగా రెండేళ్ల తర్వాత ఫంక్షన్లకు అనువైన వాతావరణం నెలకొంది. ముహూర్తాలు కూడా ఎక్కువే ఉన్నాయి.  కరోనా.. ముహూర్తాలు లేకపోవడం.. వంటి ఎన్నో కారణాల వల్ల నిలిచిపోయిన  వివాహాలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ మే నెల నుండి పెళ్లిళ్లకు బలమైన ముహుర్తాలు ఉన్నాయి. దీంతో ఎప్పటిలాగే ఫంక్షన్ల హాళ్లు మళ్లీ బిజీ బిజీగా మారబోతున్నాయి. 
 

38
Asianet Image

గతంలో కరోనా ఉద్రిక్తత వలన పెళ్లి ముహూర్తాల సమయంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది పెళ్లిళ్లను వాయిదా కూడా వేసుకున్నారు. ఇక పెళ్లిళ్ల సందడి లేకపోవడంతో ఆయా రంగాలకు చెందిన వారు చాలా నష్టపోవాల్సి వచ్చింది. 
 

48
Asianet Image

ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో ఎన్నో జంటలు వివాహాలకు సిద్ధమవుతున్నాయి. గత ఏప్రిల్ నెలలో పలు జంటలు పెళ్లిళ్లు చేసుకోగా మే నెల వైశాఖ మాసం కాబట్టి బలమైన ముహూర్తాలు చాలానే ఉన్నాయి. మే, జూన్, నెలల్లో తెలుగు రాష్ట్రాలలో సుమారు 50 వేల జంటలు ఒక్కటి కానున్నాయి. మే నెలలో  4, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 20, 21, 22, 23, 25, తేదీలు పెళ్లిళ్లకు మంచి రోజులు. 

58
Asianet Image

ఈ ముహూర్తాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జంటలు వివాహాలు చేసుకొనేందుకు సన్నద్దం అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య దేశంలో పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 
 

68
Asianet Image

తెలంగాణలో కొవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుంది. ఆలస్యం చేస్తే మళ్లీ కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మే నెలలో పెళ్లి తంతు పూర్తయ్యేలా ఎక్కువ మంది ముహూర్తాలు చూసుకుంటున్నారు. అందులోనూ ఫోర్త్ వేవ్ రాకమునుపే తమ వివాహాలు చేసుకోవాలని ఆయా జంటలు భావిస్తున్నాయి. ఈ మేరకు వారు షెడ్యూల్ చేసుకొని పెళ్లిళ్లు చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. 

78
Asianet Image

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లినా.. తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. అలాగే సోషల్ డిస్టెన్స్ ను మెయిన్ టెయిన్ చేయాలి. కొవిడ్ ఆంక్షలు లేవుకదా అని ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కరోనా బారిన పడాల్సి వస్తుంది జాగ్రత్త.. 
 

88
Asianet Image

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

About the Author

Mahesh Rajamoni
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved