పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. వెంటనే ఇలా అప్లయ్ చేసుకోండి
రైల్ వీల్ ఫ్యాక్టరీ ట్రేడ్ అప్రెంటీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 192 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది. సెప్టెంబర్ 13 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది.
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి సంబంధిత సబ్జెక్టులో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT)నుండి నేషనల్ ట్రేడ్ అప్రెంటీస్ సర్టిఫికెట్ తప్పనిసరి కలిగి ఉండాలి.
దరఖాస్తుల కోసం జనరల్ కేటగిరీ అభ్యర్ధి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నత వయస్సు సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,261 వేతనం ఉంటుంది.
పోస్టుల ఖాళీలు
ఫిట్టర్ - 85, మెషినిస్ట్ - 31, మెకానిక్ - 8, టర్నర్ - 5, సీఎంసీ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ ఆపరేటర్ - 23, ఎలక్ట్రీషియన్ - 18, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 22
దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 13న లేదా అంతకు ముందు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు -560064 కార్యాలయానికి అవసరమైన డాక్యుమెంట్స్ తో దరఖాస్తులను సమర్పించవచ్చు. సెప్టెంబర్ 13 తర్వాత దరఖాస్తులు పరిగణించబడవు.
ఎంపిక ప్రక్రియ: రైల్ వీల్ ఫ్యాక్టరీ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 10వ తరగతిలో సాధించిన మార్కులు, ఐటిఐలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తులకు చివరితేది: 13 సెప్టెంబర్ 2021
అధికారిక వెబ్‌సైట్:https://rwf.indianrailways.gov.in/