Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2500 ఆఫీసర్ ఉద్యోగాలు..ఎలా సెలెక్ట్ చేస్తారంటే!
బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 స్థానిక బ్యాంక్ అధికారుల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. అర్హులైనవారు జూలై 24లోపు దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ ఆఫ్ బరోడా
భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2500 స్థానిక బ్యాంక్ అధికారుల పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
బ్యాచిలర్ డిగ్రీ
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2025 జూలై 24లోపు తమ దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే, అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హత సరిపోతే సరిపోదు, వయోపరిమితి కూడా ఉంటుంది. 2025 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. మొదటిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థి ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉన్నా, అది కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. తుది ఎంపిక మాత్రం కంప్యూటర్ పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా జరగుతుంది.
కంప్యూటర్ పరీక్ష
కంప్యూటర్ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. వీటి కోసం 120 మార్కులు కేటాయించారు. ఈ ప్రశ్నలు ఆప్టిట్యూడ్, గణితం, ఇంగ్లీష్, సాధారణ బ్యాంకింగ్ సంబంధిత అంశాల నుండి వస్తాయి. పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే, అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ అయిన www.bankofbaroda.co.in ద్వారా అప్లై చేయాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకి రూ.850గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం మాత్రం ఈ రుసుమును రూ.175కి తగ్గించారు.
బ్యాంకింగ్ రంగంలో
ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రాంతీయ భాష పరీక్షలో అర్హత సాధించిన తర్వాత, అభ్యర్థి దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా జాయిన్ కావొచ్చు.ఇంకా, ఎంపికైన అభ్యర్థులకు జీతంగా రూ.48,480 నుండి రూ.85,920 వరకు చెల్లిస్తారు. ఇది బ్యాంకింగ్ రంగంలో మంచి స్థాయి జీతం కాగా, భద్రతతో కూడిన ఉద్యోగం కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకుని వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ రంగం మీద ఆసక్తి ఉన్న యూత్‌కి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. కావున, అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ మించి ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.
అధికారిక వెబ్‌సైట్‌లో
దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాలు, పరీక్ష నమూనా, సిలబస్ వంటి అంశాలను బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచిన గైడ్‌లైన్‌లో చూడొచ్చు. అభ్యర్థులు అన్ని దశలను జాగ్రత్తగా చదివి, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి.