గూడ్ న్యూస్ : బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల.. వెంటనే ఇలా అప్లయ్ చేసుకోండీ..
బ్యాంక్ ఉద్యోగం చేయాలని కలలుకంటున్న నిరుద్యోగులకు శుభవార్త. దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేశాయి. వీటిలో యూనియన్ బ్యాంక్, ఎస్‌బిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
యూనియన్ బ్యాంక్
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12న ప్రారంభం కాగా సెప్టెంబర్ 3 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.unionbankofindia.co.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
సీనియర్ మేనేజర్ (రిస్క్)- 60
మేనేజర్ (రిస్క్)- 60
మేనేజర్ (సివిల్ ఇంజనీర్)- 7
మేనేజర్ (ఆర్కిటెక్ట్) - 7
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజర్) - 2
మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్) - 1
మేనేజర్ (ఫోరెక్స్) - 50
మేనేజర్ (ఛార్టెడ్ అకౌంటెంట్) - 14
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) - 26
అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్) - 120
విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను బట్టి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.
వయసు: సీనియర్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే అభ్యర్థుల వయస్సు 30-40 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగాలకు 25-35 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 20-30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://www.unionbankofindia.co.in/ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12 ఆగస్టు 2021
దరఖాస్తులకు చివరితేది: 3 సెప్టెంబర్ 2021
అధికారిక వెబ్‌సైట్: https://www.unionbankofindia.co.in/
ఎస్‌బిఐ ఉద్యోగనోటిఫికేషన్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 68 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, రిలేషన్ షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ తదితర పోస్టులున్నాయి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 13న ప్రారంభమైంది. సెప్టెంబర్ 2 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://sbi.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
అసిస్టెంట్ మేనేజర్- ఇంజనీర్(సివిల్)- 36
అసిస్టెంట్ మేనేజర్- ఇంజనీర్(ఎలక్ట్రికల్)- 10
అసిస్టెంట్ మేనేజర్ (మార్కెంటింగ్ అండ్ కమ్యూనికేషన్) - 4
డిప్యూటీ మేనేజర్ (Agri Spl) - 10
రిలేషన్‌షిప్ మేనేజర్ (OMP)- 6
ప్రొడక్ట్ మేనేజర్ (OMP)-1
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - 1
విద్యార్హత: అభ్యర్థులు 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్)/ పీజీడీఎం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.
వయసు: పోస్టులను బట్టి వేర్వేరు వయో పరిమితులు ఉంటాయి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 30 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్, రిలేషన్ షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర ఉద్యోగాలకు 25 నుంచి 35 ఏళ్లు, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ ఉద్యోగాలకు 60 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ: పోస్టులను బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.750 చెల్లించాల్సి ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: 13 ఆగస్టు 2021
దరఖాస్తులకు చివరితేది: 2 సెప్టెంబర్ 2021
హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్ తేది: సెప్టెంబర్ 13 నుంచి
పరీక్ష తేది: 25 సెప్టెంబర్ 2021
అధికారిక వెబ్‌సైట్: https://sbi.co.in/