డిగ్రీ, పీజీ అర్హతతో టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. జీతంరూ.1,64,000.. ఇలా అప్లయి చేసుకోండీ..
ఇండియన్ మల్టీ నేషనల్ ఐటి కంపెనీ టెక్ మహీంద్రా (Tech Mahindra)ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఈ ఉద్యోగాల భర్తీతో 100 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులని భర్తీ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ (ICSTP) ద్వారా ఈ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు పురుషులు, మహిళల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ పాసైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://apssdc.in/చూడవచ్చు. విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల దరఖాస్తులని టెక్ మహీంద్రా పరిశీలిస్తుంది. తరువాత అభ్యర్థులకు హెచ్ఆర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని హెచ్ఆర్ తెలియజేస్తారు.
మొత్తం ఖాళీలు: 100
విద్యార్హతలు: డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. 2015 నుండి 2020 సంవత్సరాల్లో ఈ కోర్సులు పాసైన వాళ్లు అర్హులు.
వయస్సు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
భర్తీ చేయనున్న పోస్టులు: కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు.
తెలియాల్సిన భాషలు: ఇంగ్లిష్, తెలుగు, తమిళ్, కన్నడ
ఎంపిక విధానం: టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్
శిక్షణా కాలం: 20 రోజులు
వేతనం: ఏడాదికి రూ.1,64,000
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16 సెప్టెంబర్ 2021
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 18 సెప్టెంబర్ 2021
ఇంటర్వ్యూ తేదీ: త్వరలోనే వెల్లడించనున్నారు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు మొదట https://apssdc.in/industryplacements/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజీలో ICSTP - Tech Mahindra - 6th Batch సెక్షన్‌లో More details పైన క్లిక్ చేయాలి.
తరువాత Apply పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
జిల్లా పేరు, ఆదార్ నెంబర్, అభ్యర్థి పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల దరఖాస్తులని టెక్ మహీంద్రా పరిశీలిస్తుంది. తరువాత అభ్యర్థులకు హెచ్ఆర్ నుంచి ఫోన్ కాల్ చేసి ఇంటర్వ్యూ ఎప్పుడన్న విషయం తెలియజేస్తారు.