MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • Sunita Williams: సునీత విలియమ్స్‌ను భూమిపైకి ఎలా తీసుకొస్తారు? అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్‌లోకి ఎలా వస్తారు?

Sunita Williams: సునీత విలియమ్స్‌ను భూమిపైకి ఎలా తీసుకొస్తారు? అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్‌లోకి ఎలా వస్తారు?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌ని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్  విల్‌మోర్ త్వరలోనే తిరిగి భూమ్మీద అడుగుపెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంతకీ సునీత విలియమ్స్‌ను భూమిపైకి ఎలా తీసుకురానున్నారు.? పూర్తి ప్రక్రియ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..   

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 15 2025, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sunita Williams

Sunita Williams

నాసా-స్పేస్ఎక్స్ చేపట్టిన ‘క్రూ-10’ మిషన్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 4.33 గంటలకు కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి ఎగిరింది. రాకెట్‌కు అమర్చిన అంతరిక్ష నౌక ISSలోని ఎయిర్‌లాక్‌కు అనుసంధానం చేస్తారు. ఒకసారి ఎయిర్‌లాక్‌లో డాక్ అయితే లోపల ఉన్న వాతావరణం బయటకు రాదు. దీని తర్వాత అన్ని భద్రతా తనిఖీలను పూర్తి చేసిన తర్వాత, వ్యోమగాముల కోసం అంతరిక్ష నౌక తలుపులు తెరుచుకుంటాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
NASA astronauts Sunita Williams and Barry Wilmore on board the ISS. (Photo credit/@Space_Station)

NASA astronauts Sunita Williams and Barry Wilmore on board the ISS. (Photo credit/@Space_Station)

ఈ సమయంలో వ్యోమగాములు తమ స్పేస్‌ సూటల్‌ను ధరించి అంతరిక్ష నౌక లోపలికి వెళ్తారు. డాక్ చేసిన అంతరిక్ష నౌకను ISS నుండి వేరు చేసి, థ్రస్టర్‌లు (చిన్న జెట్ ఇంజన్లు) ఉపయోగించి నియంత్రించి, దాని నిర్దేశిత గమ్యంలోకి ప్రవేశపెడతారు. ఇలా వ్యోమగాములు భూమిపై నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన అంతరిక్ష నౌకలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుంచి వ్యోమగాములు తిరిగి భూమిపైకి చేరుకునే ప్రక్రియ మొదలవుతుంది. 
 

34
Sunita Williams

Sunita Williams

అంతరిక్ష నౌక భూమికి ఎలా తిరిగి వస్తుంది?

అంతరిక్ష నౌక భూమికి తిరిగి రావడానికి సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఇందుకోసం అంతరిక్ష నౌకను సరైన పథంలోకి తీసుకువచ్చి నెమ్మదిగా భూమి వాతావరణంలోకి తీసుకువస్తారు. వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఉత్పన్నమయ్యే వేడి, మంటల నుండి అంతరిక్ష నౌకను, ప్రయాణీకులను రక్షించడానికి అంతరిక్ష నౌక ముందు భాగంలో అధిక నాణ్యత గల ఉష్ణ కవచాలను అమర్చుతారు. ఇవి అగ్నిమాపక యంత్రాలతో పాటు లోపల ఉన్న పరికరాలను, ప్రయాణీకులను చల్లగా ఉంచుతాయి, తీవ్రమైన వేడి నుండి వారిని రక్షిస్తాయి. 
 

44
Sunita Williams

Sunita Williams

ప్రయాణీకులను నేలపైకి వచ్చిన వెంటనే ఏం చేస్తారు.? 

అంతరిక్ష నౌక సరైన ఎత్తు, వేగాన్ని చేరుకున్నప్పుడు, అంతరిక్ష నౌకకు అటాచ్‌ చేసిన పారాచూట్ తెరుచుకుంటుంది. ఈ పారాచూట్లు అంతరిక్ష నౌకను సేఫ్‌ ల్యాండింగ్‌కు సహాయపడుతాయి. ప్రయాణీకులను తిరిగి తీసుకువచ్చే అంతరిక్ష నౌకలు ఎక్కువ శాతం నీటిలో ల్యాండ్‌ అవుతాయి. ఇందుకోసం మహా సముద్రాలను ఎంచుకుంటారు. సముద్రంలో ల్యాండ్‌ కాగానే రికవరీ బృందం వారి వద్దకు వస్తుంది. రికవరీ బృందం వారిని వైద్య కేంద్రానికి తీసుకెళుతుంది, అక్కడ వారి ఆరోగ్య పరిస్థితులను చెక్‌ చేస్తారు. అనంతరం వారిని విడిగా ఉన్న ప్రత్యేక గదిలో ఉంచుతారు. కొన్ని వారాల తర్వాత వారిని భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి అలవాటు చేసి, ఆ తర్వాత బయటకు పంపిస్తారు. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved