ఎయిడ్స్ గురించి ఇలాంటి అపోహలు అసలే వద్దు
World AIDS Day 2023: ఎయిడ్స్ ఒక ప్రాణాంతక వ్యాధి. అయినా దీని గురించి జనాలను అవగాహన చాలా తక్కువగా ఉంది. అందుకే నేటికీ జనాలు దానితో సంబంధం ఉన్న ఎన్నో అపోహలను గుడ్డిగా నమ్ముతారు. అందుకే ఈ వ్యాధి గురించి జనాలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఈ వ్యాధి గురించి ఎలాంటి అపోహలను నమ్మకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
World AIDS Day 2023: నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎయిడ్స్ ప్రాణాంతక రోగం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ప్రజలకు ఈ వ్యాధి గురించి మరింత అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోగానికి సకాలంలో చికిత్స తీసుకుంటే దీన్ని నియంత్రించొచ్చు.
ఏదేమైనా ఈ వ్యాధి గురించి జనాలకు ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా ఎయిడ్స్ కు సంబంధించిన అపోహలు, వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
హెచ్ఐవి, ఎయిడ్స్ అంటే?
హెచ్ఐవి అనేది అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్ కు కారణమయ్యే వైరస్. ఈ వైరస్ మన ఇమ్యూనిటీ పవర్ ను దెబ్బతీస్తుంది. దీనివల్ల క్యాన్సర్లు, సంక్రమణ వంటి ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. మరి ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని సాధారణ అపోహలు, వాటి నిజానిజాల గురించి తెలుసుకుందాం పదండి.
అపోహ 1: హెచ్ఐవి కొన్ని లైంగిక కార్యకలాపాల వల్లే వస్తుంది
వాస్తవం: దీనిలో అస్సలు నిజం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. హెయ్ఐవీ లేదా ఎయిడ్స్ వ్యాధి లింగం లేదా లైంగిక ధోరణితో సంబంధం లేకుండా ఎవరికైనా వస్తుంది. ఎవ్వరైనా హెచ్ఐవీ బారిన పడొచ్చు.
అపోహ 2: హెచ్ఐవి ఉంటే వ్యాయామం చేయకుడదా?
వాస్తవం: ఇది కూడా అపోహే. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవారు కూడా వ్యాయామం చేయొచ్చు. వ్యాయామం మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. హెచ్ఐవీ ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం మీ అలసటను పోగొడుతుంది. అలాగే ఆకలిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే కండరాలను, ఎముకలను కాపాడుతుంది.
అపోహ 3: భాగస్వాములిద్దరూ హెచ్ఐవి పాజిటివ్ అయితే కండోమ్ల అవసరం లేదు
వాస్తవం: దీనిలో కూడా నిజం లేదు. హెచ్ఐవీ ఉన్న వ్యక్తులకు ఇతర ఎస్టీఐల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే హెచ్ఐవీ ఉన్న భాగస్వాములు అసురక్షిత శృంగారానికి దూరంగా ఉండాలి. ఖచ్చితంగా కండోమ్ లను వాడాలి.
అపోహ 4: హెచ్ఐవీ ఉంటే చాలా రోజులు మందులు వాడాలి
వాస్తవం: ఇది చాలా కాలం కిందటిది. హెచ్ఐవీతో బాధపడే వారు మాత్రలను ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు హెచ్ఐవీ చికిత్స పొందుతున్న చాలా మంది రోజుకు 1 నుంచి 2 మాత్రలు మాత్రమే తీసుకుంటారు.
world aids day
అపోహ 5: వీళ్లకు హెచ్ఐవీ ఉందని ఈజీగా తెలుసుకోవచ్చు
వాస్తవం: అస్సలు కాదు. ఎందుకంటే హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులను వారి లక్షణాల ద్వారా గుర్తించలేం. వాస్తవానికి హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లేదా ఇతర ఆరోగ్య సమస్యలను సూచించే లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. కానీ వీరికి ఎయిడ్స్ ఉందని గుర్తించడం చాలా కష్టం.