MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒక్కటే అనుకుంటున్నారా?

హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒక్కటే అనుకుంటున్నారా?

World AIDS Day 2023: ఎయిడ్స్ వీళ్లను, వాళ్లను అనే కాదు ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ చాలా మంది ఈ వ్యాధి గురించి అవగాహన తక్కువగా ఉంది. అందుకే ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఈ వ్యాధి గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.   

3 Min read
Shivaleela Rajamoni
Published : Dec 01 2023, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

World AIDS Day 2023: ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి అన్న సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ వ్యాధి గురించి నేటికీ ఎంతో మందికి సరిగ్గా తెలియదు. ఇదే జనాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుంది. హెచ్ఐవీ సంక్రమణ వ్యాప్తి వల్ల కలిగే ఎయిడ్స్ మహమ్మారి గురించి జనాలకు అవగాహనను పెంచడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే చాలా మందిక హెచ్ఐవీ, ఎయిడ్స్ మధ్య తేడా తెలియదు. దీనికారణంగా చికిత్స తీసుకోవడాన్ని ఆలస్యం చేస్తున్నారు. మరి వీటి మధ్య ఉన్న తేడా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

29
Asianet Image

హెచ్ఐవీ అంటే ఏమిటి?

హెచ్ఐవీ అనేది ఒక వైరస్. దీనిని హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ అని కూడా అంటారు. ఈ హెచ్ఐవీ మీ రోగనిరోధక వ్యవస్థ కణాలను సోకుతుంది. అలాగే వాటిని నాశనం చేస్తుంది. దీంతో మీరు ఇతర రోగాలతో పోరాడలేరు. అంటే మీకు ఎన్నో రోగాలు సోకుతాయి. అలాగే వాటిని తగ్గించుకోవడం కష్టంగా మారుతుంది. ఈ విధంగా హెచ్ఐవీ మీ రోగనిరోధక శక్తిని పూర్తిగా  బలహీనపరిచినప్పుడు.. అది అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్  కు కారణమవుతుందన్న మాట.
 

39
Asianet Image

ఎయిడ్స్ అంటే ఏమిటి?

ఎయిడ్స్ అనేది హెచ్ఐవీ సంబంధిత వ్యాధి. అంటే ఇది సంక్రమణ చివరి, ప్రాణాంతక దశ. ఎయిడ్స్ ఉన్నవారికి తెల్ల రక్తకణాలు తక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ల రోగనిరోధక శక్తి కూడా బాగా దెబ్బతింటుంది.
 

49
Asianet Image

హెచ్ఐవీ, ఎయిడ్స్ మధ్యనున్న తేడా? 

నిపుణుల ప్రకారం.. హెచ్ఐవీ, ఎయిడ్స్ మధ్యనున్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. హెచ్ఐవీ ఒక వైరస్. ఇది మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అలాగే  మీ రోగనిరోధక వ్యవస్థ మరీ  బలహీనపడినప్పుడు హెచ్ఐవి సంక్రమణకు కారణమయ్యే పరిస్థితి లేదా వ్యాధే ఎయిడ్స్.

ఒకరు హెచ్ఐవీ బారిన పడితే తప్ప ఎయిడ్స్ బారిన పడలేరు అనేది అందరూ గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ హెచ్ఐవీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎయిడ్స్ ఉండదు. కానీ చికిత్స తీసుకోకుంటే హెచ్ఐవీ ఎయిడ్స్ కు ఖచ్చితంగా కారణమవుతుంది.
 

59
Asianet Image

హెచ్ఐవీ ఎవరిని ప్రభావితం చేస్తుంది?

హెచ్ఐవి కొంతమందికి మాత్రమే సంక్రమిస్తుందని ఎంతో మంది నమ్ముతారు. కానీ దీనిలో నిజం లేదు. వైరస్ బారిన పడితే ఎవరైనా హెచ్ఐవీ బారిన పడే అవకాశం ఉంది. ఏదేమైనా వీళ్లు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.. 

సెక్స్ వర్కర్లు
గే లేదా బైసెక్సువల్ 

69
Asianet Image

హెచ్ఐవి లక్షణాలు? 

హెచ్ఐవీ ఉన్న ప్రతి ఒక్కరిలో లక్షణాలు కనిపిస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. హెచ్ఐవీ ఉన్నా కొంతమందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే మీకు అనారోగ్యంగా అనిపించకపోయినా పరీక్ష చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు. హెచ్ఐవీ వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే?

జ్వరం
అలసట
చల్లదనం
నోట్లో పుండ్లు
గొంతు నొప్పి
కండరాల నొప్పి
రాత్రిపూట చెమటలు పట్టడం
శోషరస కణుపులలో వాపు
 

79
Asianet Image

హెచ్ఐవీ దశలు?

హెచ్ఐవీ సోకినంత మాత్రాన ఆ వ్యక్తికి ఎయిడ్స్ ఉందనైతే కాద. అయితే ఈ వైరస్ బారిన పడిన తర్వాత ఎయిడ్స్ మూడు దశలను దాటుతుంది. మరి ఆ మూడు దశలు ఏవంటే? 

దశ 1: తీవ్రమైన హెచ్ఐవీ

హెచ్ఐవి సోకిన తర్వాత కొంతమందికి ఒకటి లేదా రెండు నెలల తర్వాత ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా వారం నుంచి ఒక నెలలో తగ్గిపోతాయి. 

89
world aids day

world aids day

స్టేజ్ 2: క్రానిక్ స్టేజ్

మొదటి దశలో ఈ వైరస్ ను గుర్తించకపోతే రెండో దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో మీకు అనారోగ్యంగా అస్సలు అనిపించదు. కానీ మీరు హెచ్ఐవీ బారిన పడతారు. ఈ దశలో మీరు మంచి అనుభూతి చెందుతున్నప్పటికీ.. మీరు హెచ్ఐవిని ఇతరులకు వ్యాప్తి చేయగలరు. 

99
Asianet Image

స్టేజ్ 3: ఎయిడ్స్

ఎయిడ్స్ అనేది హెచ్ఐవీ సంక్రమణ అత్యంత ప్రాణాంతకమైన, చివరి దశ. ఈ దశలో హెచ్ఐవీ మీ రోగనిరోధక శక్తిని దారుణంగా బలహీనపరుస్తుంది. అలాగే ఈ దశలో మీ ఆరోగ్యం బాగా పాడవుతుంది. తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved