MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • బొడ్డుకు ఆవనూనె, ఇంగువ రాస్తే ఏమౌతుందో తెలుసా?

బొడ్డుకు ఆవనూనె, ఇంగువ రాస్తే ఏమౌతుందో తెలుసా?

ఇంగువ, ఆవనూనెలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. వీటిని బొడ్డుకు రాయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.   

Shivaleela Rajamoni | Published : Sep 11 2024, 12:30 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
belly button

belly button

హెల్తీగా, ఫిట్ గా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటుగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమ్మమ్మలు, నానమ్మలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఇంటి చిట్కాలతోనే తగ్గించడం మనం రోజూ చూస్తేనే ఉంటాం. 

25
belly button

belly button

అయితే మన వంటగదిలో ఉండే ఎన్నో వస్తువుల్లో కూడా  చాలా ఔషధ గుణాలుంటాయి. మనం వీటిని సక్రమంగా వాడితే ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చంటారు నిపుణులు. చిన్న పిల్లలకు కడుపునొప్పి వచ్చినప్పుడు నానమ్మకానీ, అమ్మమ్మ కానీ బొడ్డును నూనె రాయడం మీరు చూసే ఉంటారు.

నిజానికి బొడ్డులో కొన్ని చుక్కల నూనెను వేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇంగువ, ఆవనూనెను బొడ్డుకు రాస్తే ఎంతో మేలు జరుగుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35
belly button

belly button

ఆవనూనె, ఇంగువ బొడ్డుకు రాసుకుంటే ఏమవుతుంది? 

ఇంగువ, ఆవనూనెను బొడ్డుకు రాయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీనివల్ల  ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. గ్యాస్ ట్రబుల్ వల్ల కడుపుగా బరువుగా, నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుంటుంది. అయితే మీరు బొడ్డుకు ఇంగువ, ఆవనూనెను రాయడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

మలబద్దకం, తిన్నది సరిగ్గా జీర్ణం కానీ వారు, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు దీన్ని బొడ్డుకు అప్లై చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవనూనె, ఇంగువలో  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని నియంత్రిస్తాయి. పుల్లని త్రేన్పులను ఆపుతాయి. 

45
belly button

belly button

ఆవనూనెలో విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. దీన్ని నాభిలో కొన్ని చుక్కలు వేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మురికి తొలగిపోయి శరీరం నిర్విషీకరణ చెందుతుంది. పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పి, తిమ్మిరిని తగ్గించడానికి కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే తిన్నది బాగా జీర్ణమవుతుంది. 

55
Asianet Image

బొడ్డుకు ఆవనూనె, ఇంగువను ఎలా అప్లై చేయాలి?

 ఇందుకోసం ముందుగా ఒక టీస్పూన్ ఆవనూనెను తీసుకుని అందులో చిటికెడు ఇంగువను వేసి కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను బొడ్డుకు అప్లై చేయండి. అలాగే బొడ్డు చుట్టూ కొద్దిసేపు మసాజ్ చేయండి. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved