అధిక కొలెస్ట్రాల్, డయాబెటీస్ పేషెంట్లు వెల్లుల్లిని ఎలా తినాలో తెలుసా?
వెల్లుల్లి సీజనల్ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఎందుకంటే దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి వెల్లుల్లిని ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం నుంచి డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లితో ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లి డయాబెటిస్ ను నియంత్రించడం, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంతో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముడి వెల్లుల్లి టేస్టీగా ఉండనప్పటికీ.. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపున..
పచ్చి వెల్లుల్లిని పరిగడుపున తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పచ్చి వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తం సన్నబడటానికి సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి ఉదయం ఒక గ్లాసు నీటిలో కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినండి. అయితే వీటిని వండినప్పుడు అల్లిసిన్ తగ్గుతుంది. అందుకే వెల్లుల్లిని తినడానికి అనువైన మార్గం పచ్చిగా, ఖాళీ కడుపుతో తినడమని నిపుణులు చెబుతున్నారు. పచ్చి వెల్లుల్లిని ఒక గ్లాసు నీటితో తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.
Garlic
వెల్లుల్లి టీ
పచ్చి వెల్లుల్లి రుచి నచ్చకపోతే వీటితో టీ పెట్టుకుని తాగొచ్చు. నిజానికి వెల్లుల్లి టీ బలే టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి టీ ని తయారు చేయడానికి ఒక వెల్లుల్లి రెబ్బను నూరి ఒక కప్పు నీటిలో కలపండి. టీని కొన్ని నిమిషాలు మరిగించి తర్వాత 1-2 టీస్పూన్ల దాల్చినచెక్క పొడిని వేయండి. కొద్దిసేపటి తర్వాత ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం కలపండి. స్టవ్ ఆపేసి తాగేయండి. మీ రోగనిరోధక శక్తిని పెంచే కప్పు వెల్లుల్లి టీ ఉదయాన్నే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వెల్లుల్లి, తేనె
వెల్లుల్లికి తేనెను కలిపి తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇందుకోసం ఒక వెల్లుల్లి రెబ్బను మూడు నాలుగు ముక్కలుగా కోసి చెంచాపై ఉంచాలి. చెంచాకు కొన్ని చుక్కల తేనె కలిపి రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత వెల్లుల్లిని బాగా నమిలి మింగేయాలి. రుచి ఘాటుగా ఉంటే కొన్ని సిప్స్ గోరువెచ్చని నీటిని కలపొచ్చు. ఇది యాసిడ్ రిఫ్లక్స్, రెగ్యురిటేషన్ లక్షణాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
కాల్చిన వెల్లుల్లి
వెల్లుల్లిని వేయించడం వల్ల కూడా దీని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. వెల్లుల్లిని కాల్చడం వల్ల అవి మృదువుగా, కొద్దిగా తీయగా అవుతాయి. వెల్లుల్లిని వేయించడానికి వెల్లుల్లి పొట్టును వలచకూడదు. వెల్లుల్లి రెబ్బలను ఆలివ్ నూనెతో ముంచి అల్యూమినియం ఫాయిల్ లో చుట్టాలి. దీనిని ఓవెన్లో 400 °F వద్ద సుమారు 30-35 నిమిషాలు లేదా మృదువుగా, అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి. చల్లారిన తర్వాత కాల్చిన వెల్లుల్లి రెబ్బల పొట్టును వలచండి. వీటినిన రొట్టెపై పెట్టి తినండి. లేదా డిప్స్, సాస్లలో కలిపి తినండి.
రోజువారీ వంటలో..
వెల్లుల్లిని మీ రోజువారీ ఆహారంలో చేర్చడానికి సులభమైన మార్గాలలో ఒకటి మీ సాధారణ భోజనంలో చేర్చడం. వెల్లుల్లి కూరగాయలు, కూరలు, పప్పులు, సూప్ లు, స్టిర్-ఫ్రైస్ తో సహా వివిధ రకాల వంటకాలలో కలపండి. వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి లేదా క్రష్ చేయండి. వీటిని కొద్దిగా నూనెలో వేయించండి. వెల్లుల్లిని వంటలో వేయడం వల్ల దానిలోని అల్లిసిన్ తగ్గుతుంది.